మీ దేశం నేతలే రావట్లేదు.. నేనెందుకొస్తా?! | Guest Of Honour, Mugabe, Drops Out Though He Is In Delhi | Sakshi
Sakshi News home page

మీ దేశం నేతలే రావట్లేదు.. నేనెందుకొస్తా?!

Published Thu, Mar 10 2016 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

మీ దేశం నేతలే రావట్లేదు.. నేనెందుకొస్తా?!

మీ దేశం నేతలే రావట్లేదు.. నేనెందుకొస్తా?!

వివాదాల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనా'నికి హాజరుకాకూడదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే నిర్ణయించుకున్నారు.

న్యూఢిల్లీ: వివాదాల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనా'నికి హాజరుకాకూడదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే నిర్ణయించుకున్నారు. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మూడురోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముగాబే ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. అయినా.. ఈ కార్యక్రమం చుట్టూ వివాదాలు ముసురుకోవడం, ప్రోటోకాల్ నిర్వహణ, భద్రత విషయంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన తిరిగి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా ముగాబే పాల్గొనాల్సి ఉంది. అయితే ఆతిథ్యమిస్తున్న దేశంతోపాటు వివిధ దేశాల నేతలు ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి వైదొలిగారని, ఈ నేపథ్యంలో ముగాబే కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించారని ఆయన అధికారిక వెబ్‌సైట్‌ ఓ ప్రతికా ప్రకటనలో వెల్లడించింది. 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం'లో పాల్గొనరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యమునా నది తీరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలతో ప్రణబ్‌ తప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఈ కార్యక్రమ ప్రారంభ సదస్సుకు హాజరుకానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement