
ఆత్మహత్యకు పాల్పడిన ఆదిత్య(ఫైల్)
ఆటోనగర్(విజయవాడ తూర్పు): చెడు స్నేహానికి అలవాటు పడి యువకుడు నిండుప్రాణాలను బలితీసుకున్న ఘటన రామలింగేశ్వరనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. పటమట పోలీసుల అందించిన వివరాలు.. మందపాటి ఆదిత్య(25) డిగ్రీ మధ్యలో చదువు మానివేసి వ్యసనాలకు బానిసయ్యాడు. పనికి వెళ్లే విషయలో వివా దం రావడంతో గురువారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిమీద బయటికి వెళ్లిన తల్లి కరుణజ్యోతి ఇంటికి వచ్చి చూస్తే ఉరి వేసుకుని వేలాడుతుండడంతో పోలీ స్‌లకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.