ఉదిత్‌ నారాయణ్‌ కోడలు కాబోతున్న సింగర్‌! | Udit Narayan Wants Neha Kakkar To Be His Daughter In Law | Sakshi
Sakshi News home page

ఉదిత్‌ నారాయణ్‌ కొడుకుతో సింగర్‌ పెళ్లి!!

Jan 13 2020 4:12 PM | Updated on Jan 13 2020 4:25 PM

Udit Narayan Wants Neha Kakkar To Be His Daughter In Law - Sakshi

ముంబై: ప్రముఖ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌-11 వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ ఉదిత్‌ నారాయణ్‌, గాయని అల్కా యాగ్నిక్‌ అతిథులుగా సందడి చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఈ షో జడ్జి నేహా కక్కర్‌ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు రావడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. షో హోస్ట్‌, ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు ఆదిత్య నారాయణ్‌ తమకు బాగా నచ్చాడని.. అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో నేహా కంగుతిన్నారు. నటుడు, బుల్లితెర హోస్ట్‌గా గుర్తింపు పొందిన ఆదిత్య నారాయణ్‌ ప్రస్తుతం ఇండియన్‌ ఐడల్‌ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా జడ్జి నేహా కక్కర్‌ను ప్రేమిస్తున్నానంటూ తరచుగా ఆమెకు ప్రపోజ్‌ చేయడం... ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేయడం వంటి పరిణామాలతో షో సందడిగా సాగుతోంది. (‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’)

ఈ క్రమంలో ఆదివారం నాటి షోకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదిత్‌ నారాయణ దంపతులతో పాటు నేహా కక్కర్‌ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు వచ్చారు. నేహను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉదిత్‌ నారాయణ పేర్కొన్నారు. ఆయన భార్య దీపా నారాయణ్‌ సైతం ఇదే ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతేగాక నేహా తల్లిదండ్రులు కూడా పెళ్లి ఖాయం చేశామంటూ వ్యాఖ్యానించడంతో నేహా సహ జడ్జీలు ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14న నేహా-ఆదిత్యల వివాహం జరుగనుందంటూ ప్రోమోలో పేర్కొనడంతో..ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే.. ‘ఇదంతా నిజమా లేదా షో రేటింగ్‌ను పెంచే క్రమంలో భాగంగానో తెలియదు గానీ.. మీ జంట బాగుంటుంది నేహా- ఆదిత్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి పలు బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్‌ ఐడల్‌ వేదికపై గతంలో ప్రకటించారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement