తనతో నా పెళ్లి ఫేక్‌.. టీఆర్‌పీ కోసమే: సింగర్‌ | Neha Kakkar Reveled That Aditya Narayan Marry To Her Is A Fake | Sakshi
Sakshi News home page

కావాలనే ఆదిత్యను అలా ఆటపట్టించాను: ఉదిత్‌ నారాయణ్‌

Published Thu, Feb 27 2020 6:05 PM | Last Updated on Thu, Feb 27 2020 7:07 PM

Neha Kakkar Reveled That Aditya Narayan Marry To Her Is A Fake  - Sakshi

గత కొంతకాలంగా ప్రముఖ గాయని నేహా కక్కర్‌ ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 11 మ్యూజిక్‌ షో యాంకర్‌ అదిత్య నారాయణ్‌లు త్వరలో వివాహం చేసుకోబుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు ఇండియన్‌ ఐడల్‌ షోలో స్పష్టం చేశారు. ఇక అప్పటి నుంచి నేహా, అదిత్యల జోడి కుదరినట్లేనని అందరూ ఫిక్సైపోయారు. నేహా అభిమానులైతే ఆమె పెళ్లి తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేహా అందరికి షాకిస్తూ... వారి పెళ్లి అంతా అబద్ధమని, కేవలం టీఆర్‌పీ కోసమే.. పెళ్లి ఎపిసోడ్‌ పేరుతో షోలో అలా నటించామని వెల్లడించింది. ఇక అదిత్య ఈ ఏడాది చివరిలో తన చిరకాల ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పింది. అదే విధంగా దీనిపై అదిత్య తండ్రి, గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అదిత్యను కావాలనే నేహాను పెళ్లి చేసుకోమ్మంటూ ఆటపట్టించేవాడిని.. కానీ అదిత్య కొట్టిపారేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్‌పై దృష్టి పెడుతున్నానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకొనని చెప్పేవాడు. అయినా వినకుండా అదిత్యతో, నేహాను పెళ్లి చేసుకొమ్మంటూ ఏడిపిస్తూనే ఉంటాను’ అని చెప్పాడు. 

ఆ షో జడ్జ్‌తో హోస్ట్‌ పెళ్లి!

కాగా ఇండియన్‌ ఐడల్‌ షోకి నేహా జడ్జీగా వ్యవహరించగా.. ఆదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెషల్‌ వెడ్డింగ్‌ ఎపిసోడ్‌ పేరుతో టెలికాస్ట్‌ చేసిన ఈ షోలో ఆదిత్య తండ్రి ఉదిత్‌ నారాయణ్‌, తల్లి దీప నారాయణ్‌లతో పాటు నేహా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో అందరి ముందు నేహాను తమ కోడలిగా చేసుకుంటామని ఉదిత్‌ నారాయణ్‌ దంపతులు ప్రకటించగడంతో.. నేహా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని వారింటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నట్లుగా షోలో చూపించారు. అంతేగాక  ఇటీవల న్యూ ఈయర్‌ వేడుకలో భాగంగా గోవా బీచ్‌లో నేహా, ఆదిత్యలు సందడి చేసిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక నేహా, ఆదిత్యల పెళ్లి ఎపిసోడ్‌ ఫేక్‌ అని తెలిసి ఆమె అభిమానులు నిరాశ పడుతుంటే.. మరికొందరు తమని ఫూల్‌ చేసినందుకు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. 

‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement