ఆ షో జడ్జ్‌తో హోస్ట్‌ పెళ్లి! | Neha Kakkar And Aditya Narayan May Be Married Soon | Sakshi
Sakshi News home page

ఆ షో జడ్జ్‌తో హోస్ట్‌ పెళ్లి!

Published Mon, Feb 3 2020 9:07 AM | Last Updated on Mon, Feb 3 2020 9:11 AM

Neha Kakkar And Aditya Narayan May Be Married Soon - Sakshi

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 11 హోస్ట్‌ ఆదిత్య నారాయణ్‌, జడ్జ్‌ నేహా కక్కర్‌లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిత్య, నేహాల మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. దీనికి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇటీవల ఆదిత్య నేహాకు ప్రపోజ్‌ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు సింగర్లు కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల ఆదిత్య, నేహా తల్లిదండ్రులు ఇండియన్‌ ఐడల్‌ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్‌ నారాయణ్‌.. నేహాను ఆటపట్టించాడు. నేహాను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదిత్య తల్లి దీప కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ షోను ప్రసారం చేస్తున్న చానల్‌ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్టు ఓ ప్రొమోలో తెలిపింది. అయితే ఇది షో ప్రమోషన్‌ కోసం చేసిందా లేక నిజంగానే ఫిబ్రవరి 14న నేహా, ఆదిత్యలు పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా సోషల్‌ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరు కలిసి గోవా బీచ్‌లో నేహా సోదరుడు టోని కక్కర్‌ రూపొందించిన ఓ సాంగ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement