నిజమైన ప్రేమకోసం... | prema pipasi motion poster release | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమకోసం...

Published Tue, Sep 17 2019 12:52 AM | Last Updated on Tue, Sep 17 2019 12:52 AM

prema pipasi motion poster release - Sakshi

కపిలాక్షి మల్హోత్రా, జీపీఎస్

జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్‌ ఫర్‌ ట్రూ లవ్‌’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌పై రాహుల్‌ బాయ్‌ మీడియా అండ్‌ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పి.ఎస్‌.రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మించారు.

ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని సీనియర్‌ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్‌ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్‌ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్‌.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్‌ పండిట్, జియస్‌ రావ్, వై. వెంకటలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement