
‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ అని వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అని, ఇలా పలు టైటిల్స్ ప్రచారంలోకొచ్చాయి. తాము అనుకున్న టైటిల్‌ని ఉగాది పండగ సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ టైటిల్‌ను, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్ చూస్తుంటే అగ్ని స్వభావంతో ఉన్నట్లు రామ్‌చరణ్ పాత్రను, జల స్వభావంతో ఉన్నట్లు ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి తీర్చిదిద్దారని అర్థమవుతోంది. ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్స్ , అలిసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment