Prabhas Adipurush Movie Motion Poster Released Today - Sakshi
Sakshi News home page

Adipurush Movie: ప్రభాస్ ఆదిపురుష్.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు!

Published Sat, Apr 22 2023 12:25 PM | Last Updated on Sat, Apr 22 2023 12:32 PM

Prabhas Adipurush Movie Motion Poster Released Today - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషిస్తున్నారు.  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్.

అక్ష‌య తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరిక‌ల్ మోష‌న్ పోస్ట‌ర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

'మా బ‌ల‌మేదంటే మీ పై న‌మ్మ‌క‌మే.. త‌ల‌పున నువ్వుంటే స‌క‌లం మంగ‌ళ‌మే... మ‌హిమాన్విత మంత్రం నీ నామ‌మే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్‌  పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్‌ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

కాగా.. గతంలో ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్‌ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్‌ 16న రిలీజ్‌ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement