సురయ్యా.. ఆగయా | katrina kaif thugs of hindostan motion poster release | Sakshi
Sakshi News home page

సురయ్యా.. ఆగయా

Published Sat, Sep 22 2018 12:31 AM | Last Updated on Sat, Sep 22 2018 12:31 AM

katrina kaif thugs of hindostan motion poster release - Sakshi

కత్రినా కైఫ్‌

‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారు బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్‌ చిత్రాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’. అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ ఖాన్, ఫాతిమా సనా షేక్‌ ముఖ్య తారలు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ మూవీ దీపావళి కానుకగా నవంబర్‌ 8న రిలీజ్‌ కానుంది.

దీంతో ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్రంలో కీలక పాత్రలకు సంబంధించిన లుక్స్, మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. శుక్రవారం కత్రినా కైఫ్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈ పొడుగుకాళ్ల సుందరి సురయ్యా పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూసిన అభిమానులు లుక్‌ అదుర్స్‌ అంటూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అజయ్‌–అతుల్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement