Kathrina kaif
-
డిసెంబర్ లో లేడీ సూపర్ స్టార్స్ వెడ్డింగ్?
-
సురయ్యా.. ఆగయా
‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఆ తర్వాత ఆమె పూర్తిగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చిత్రంలో కీలక పాత్రలకు సంబంధించిన లుక్స్, మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం కత్రినా కైఫ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఈ పొడుగుకాళ్ల సుందరి సురయ్యా పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన అభిమానులు లుక్ అదుర్స్ అంటూ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. -
‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను’
బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంజు మూవీ హిట్‌తో ఇటు ప్రొపెషనల్ లైఫ్‌లో, కో స్టార్ అలియా భట్‌తో ఏర్పడిన సరికొత్త ప్రేమ బంధంతో అటు పర్సనల్ లైఫ్‌లోనూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే సినిమాల కన్నా... హీరోయిన్లతో కొనసాగించిన ప్రేమాయణాలతోనే ఈ చాక్లెట్ బాయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సంజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని’ రణ్‌బీర్ నిజాయితీగా ఒప్పేసుకున్నాడు కూడా. అలియాతో రిలేషన్ షిప్ గురించి చెబుతూ... ‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి.. కొత్త ఆలోచనలు.. పాత విషయాలనే మరోసారి కొత్తగా చేస్తుంటామని.. అయితే ప్రస్తుతం తాను చాలా మారానని, బంధాలకు చాలా విలువ ఇస్తానని’ అన్నారు. దీపికాతో బ్రేకప్ అనంతరం కూడా రణ్‌బీర్ ఇలాగే ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘అవును. నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను. అపరిపక్వత, అనుబంధాలను పటిష్ట చేసుకునే నేర్పు లేకపోవడం.. అడ్వాంటేజ్ తీసుకోపోవడం.. ఇవన్నీ నా తప్పులే. కానీ ప్రస్తుతం నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఓ కొత్త వ్యక్తితో.. ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. మా ఇద్దరికీ పరస్పరం నమ్మకం, ప్రేమ ఉన్నాయి. గతంలో నాకు ఇలాంటి వ్యక్తి తారసపడలేదు. అందుకే బ్రేకప్ అయ్యిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కత్రినా గురించి గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం కత్రినాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత అలియా గురించి కూడా ఇలాగే మాట్లాడటంతో.. రణ్‌బీర్ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. -
కత్రినాకు చేదు అనుభవం
అట్టావా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన దురుసు ప్రవర్తన కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దబాంగ్ టూర్లో భాగంగా ప్రస్తుతం వాంకోవర్‌లో ఉన్న కత్రినా.. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్పీల కోసం అభిమానులు చుట్టుమున్నారు. తమతో సెల్పీలు దిగాల్సిందిగా కోరడంతో కొందరికి అవకాశం ఇచ్చారు. కాసేపటి తర్వాత... ‘మీరిలా చేయకండి. నేను అలసిపోయాను అని తెలుసు కదా. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ’ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు. కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ.. ‘ మీ ప్రవర్తను మార్చుకోండి. పెద్ద హీరోయిన్ అని చెప్పుకుంటారు కదా.. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే ఇలా కసురుకుంటారా’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. దీంతో కత్రినా కూడా ఆమెతో గొడవకు సిద్ధమైపోయారు. కత్రినా సెక్యూరిటీ సిబ్బంది కలుగజేసుకుని ఆమెను వారించారు. అయినప్పటికీ ఆ మహిళ ఊరుకోకుండా.. ‘మీ కోసం ఎవరూ రాలేదు. మేమంతా సల్మాన్ ఖాన్ కోసం వచ్చాం.. కేవలం ఆయన కోసమే’ అంటూ కత్రినాను హేళన చేశారు. -
ఆమెతో కలిసి నటించను : కత్రినా
ముంబై : బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, దీపికా పదుకొనే అందంతోనే కాకుండా తమ అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. ఇతర నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి కత్రినాను అడగ్గా.. అలియా భట్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, తమ కోసం ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయాల్సిందిగా ఆది(ఆదిత్య చోప్రా)కి చెప్పానన్నారు. అయితే ఆ సినిమాలో తామిద్దరికీ శక్తిమంతమైన పాత్రలు ఉండాలని, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని కోరానని తెలిపారు. అలియా, నేను కలిసి నటిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కత్రినా విశ్వాసం వ్యక్తం చేశారు. మరి దీపికాతో కలిసి మీరు నటిస్తారా అన్న ప్రశ్నకు బదులుగా క్యాట్స్ ‘నో ’ అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రణ్‌బీర్ కపూర్‌తో గతంలో కత్రినా, దీపికాలకు ఉన్న రిలేషన్ కారణంగానే కత్రినా ఈవిధంగా స్పందించారని బీ- టౌన్లో టాక్ విన్పిస్తోంది. మరి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించినప్పటి నుంచి అలియా భట్ కూడా రణ్‌బీర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం కత్రినా దృష్టికి రాలేదేమోనని సెటైర్లు వేస్తున్నారు. అయితే గతంలో అలియా కూడా కత్రినా, దీపికాలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. -
జీరో ప్రమోషన్స్
...అని చదవగానే షారుక్ ఖాన్ ‘జీరో’ సినిమాకు అసలు ప్రమోషన్స్ లేవా? అని డిసైడ్ అయిపోకండి. ప్రమోషన్స్ విషయంలో షారుక్‌కు చాలా ప్లాన్స్ ఉన్నాయట. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో షారుక్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్న చిత్రం ‘జీరో’. ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానుంది. జనరల్‌గా విడుదలకు పది పదిహేను రోజుల ముందు ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ షారుక్ మాత్రం ముందే మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటినుంచి డిసెంబర్ వరకూ వచ్చే ప్రతి పండగకు ‘జీరో’ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విశేషాన్ని మనం చూడొచ్చట. ఈ చిత్రంలో అనుష్కా శర్మ కథానాయిక. ఇది కాకుండా ఆమె కథానాయికగా నటించిన ‘పరీ’ హోలీకు విడుదల కానుంది. సో అప్పటికి ఆమె లుక్ రివీల్ చేయడంతో ‘జీరో’ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘రేస్ 3’ ఈ రంజాన్‌కు రానుంది. ఎలాగూ సల్మాన్ ఖాన్ ‘జీరో’లో ఓ పాటలో తళుక్కున మెరిశారు కాబట్టి, రంజాన్‌కు ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్‌ను ‘రేస్ 3’తో పాటుగా రిలీజ్ చేస్తారట. ఫైనల్‌గా 3 నిమిషాల నిడివి గల అఫీషియల్ ట్రైలర్‌ను దీపావళికి రాబోతున్న ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’తో జతపరచాలని భావిస్తున్నారట ‘జీరో‘ బృందం. ‘జీరో’ ఒక సెలబ్రేషన్‌లా ఉండాలని భావించారట షారుక్. అందుకని ఇలా ప్రతి పండగకు సినిమాకు సంబంధించిన ఏదో ఒక స్పెషల్‌ను రివీల్ చేయలనుకుంటున్నారని చిత్రబృందం అంటోంది. ఇంతకీ ఈ ‘జీరో’ షారుక్‌కి ఎందుకంత స్పెషల్ అంటే.. ఇందులో ఆయన చేస్తున్న క్యారెక్టర్ కూడా స్పెషలే. మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యేవరకూ షారుక్ వేరే సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యారట. -
పాట కోసం పాట్లు!
రిస్కీ ఫైట్స్ చేయడం కోసం ఎవరైనా మజిల్ ట్రైనింగ్ లాంటివి చేస్తారు. హెవీ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటారు. కానీ కత్రినా కైఫ్ పాట కోసం ఇవన్నీ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ పాట కోసం చాలా పాట్లు పడుతున్నారీ బ్యూటీ. ఇంతకీ ఏ సినిమాలోదీ పాట? ఎందుకీ పాట్లు? అయినా ‘షీలా కీ జవానీ...’, ‘చిక్నీ చమేలీ..’ వంటి ఐటమ్ సాంగ్స్‌లో అదిరిపోయేలా స్టెప్పులు వేసిన కత్రినా కైఫ్‌కి పాట్లా అనుకుంటున్నారా? ఆ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఈ పాట మరో ఎత్తు. అంత స్పెషల్ ఏంటంటే... కొన్ని స్టెప్స్ జిమ్నాస్టిక్స్ స్టైల్లో ఉంటాయట. పైగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్. ఇక.. స్టెప్స్ ఎలా ఉంటాయో వేరే చెప్పాలా? ఇంతకీ ఈ పాట ఏ సినిమాలో అంటే, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’లో. త్వరలో ఈ పాట చిత్రీరించనున్నారు. కానీ ప్రాక్టీస్ కొన్ని రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సాంగ్ కోసం కత్రినా తన వర్కవుట్ స్టైల్‌ని, డైట్‌నీ మార్చేశారు. హెవీ ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటున్నారట. కార్డియో ఎక్సర్సైజులు చేస్తున్నారట. అది మాత్రమే కాదు.. రోజుకి ఐదు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారట. ముంబైలో వేయించిన భారీ సెట్లో త్వరలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. -
రణ్‌బీర్‌తో హాలిడే ట్రిప్‌కు రెడీ!
బాలీవుడ్ క్రేజీ లవర్స్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల బంధం ఇప్పుడంత బలంగా లేదని టాక్. దీపికా పదుకొనేతో కలిసి రణ్‌బీర్ ‘తమాషా’ చిత్రంలో నటించడం కత్రినాని ఆగ్రహానికి గురి చేసిందని పరిశీలకులు అంటున్నారు. అందుకని రణ్‌బీర్‌తో కత్రినా ఇంతకు ముందు ఉన్నంత క్లోజ్‌గా ఉండటంలేదట. ఈ ఇద్దరూ దాదాపు విడిపోయినట్లేనని చెప్పుకుంటున్నారు. అలాగే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. తమ మధ్య పెరిగిన ఈ దూరాన్ని మాయం చేయడానికి రణ్‌బీర్ ట్రై చేస్తున్నారట. కొత్త సంవత్సరం సందర్భంగా కత్రినాతో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. కొంచెం మారాం చేసిన తర్వాత కత్రినా ఈ ట్రిప్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎక్కడికి చెక్కేస్తారో సన్నిహితులకు కూడా చెప్పలేదట. కచ్చితంగా ఫారిన్ కంట్రీస్‌కే వెళతారని ఊహించవచ్చు. మరి.. ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళతారో? హాలిడే ట్రిప్‌లో మనసు విప్పి, అన్నీ మాట్లాడుకుని తమ మధ్య పెరిగిన దూరాన్ని ఇక ఎప్పుడూ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తపడతారేమో! -
‘బ్రేకింగ్’ న్యూస్!
బాలీవుడ్ హాట్ ప్రేమ జంట రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య కాస్త తేడాలు వచ్చినట్టే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎవరూ బయట పడటం లేదు కానీ... చిన్న చిన్న గొడవలేవో తొంగి చూసినట్టు ఓ వెబ్సైట్ కథనం. కారణం... కత్రినా మేకప్‌మ్యాన్ సుభాష్‌సింగ్. నిన్నమొన్నటి వరకూ క్యూట్ గాళ్‌కు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా ఉన్న సుభాష్ సెట్స్‌కు లేటుగా వచ్చాడట. దీనిపై గరమైన అమ్మడు అతగాడిని చెడామడా తిట్టేసిందట. క్యాట్ తిట్ల మహత్యమేమో గానీ... ఉన్నట్టుండి మనోడు ప్రొడ్యూసరైపోయాడు. జయంత్ గిలీతర్ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నాడట. అందులో ఓ స్పెషల్ అప్పియరెన్స్ కోసం రణబీర్‌ను సంప్రదిస్తున్నాని... అతడు కాదనడన్న నమ్మకం ఉందని చెప్పాడు సుభాష్! ప్రేమ పావురాల మధ్య లిటిల్ గ్యాప్‌నకు ఇదే కారణమంటున్నారు బాలీవుడ్ జనం!