జీరో ప్రమోషన్స్‌ | Shah Rukh Khan all set to promote Zero during all festivals this year | Sakshi
Sakshi News home page

జీరో ప్రమోషన్స్‌

Published Thu, Feb 8 2018 12:46 AM | Last Updated on Thu, Feb 8 2018 12:46 AM

Shah Rukh Khan all set to promote Zero during all festivals this year - Sakshi

షారుక్‌ ఖాన్‌

...అని చదవగానే షారుక్‌ ఖాన్‌ ‘జీరో’ సినిమాకు అసలు ప్రమోషన్స్‌ లేవా? అని డిసైడ్‌ అయిపోకండి. ప్రమోషన్స్‌ విషయంలో షారుక్‌కు చాలా ప్లాన్స్‌ ఉన్నాయట. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ నటిస్తున్న చిత్రం ‘జీరో’. ఈ సినిమా డిసెంబర్‌ చివరి వారంలో రిలీజ్‌ కానుంది. జనరల్‌గా విడుదలకు పది పదిహేను రోజుల ముందు ప్రమోషన్స్‌ మొదలుపెడతారు. కానీ షారుక్‌ మాత్రం ముందే మొదలుపెట్టబోతున్నారు.

ఇప్పటినుంచి డిసెంబర్‌ వరకూ వచ్చే ప్రతి పండగకు ‘జీరో’ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విశేషాన్ని మనం చూడొచ్చట. ఈ చిత్రంలో అనుష్కా శర్మ కథానాయిక. ఇది కాకుండా ఆమె కథానాయికగా నటించిన ‘పరీ’ హోలీకు విడుదల కానుంది. సో అప్పటికి ఆమె లుక్‌ రివీల్‌ చేయడంతో ‘జీరో’ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయబోతున్నారట. ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌ 3’ ఈ రంజాన్‌కు రానుంది. ఎలాగూ సల్మాన్‌ ఖాన్‌ ‘జీరో’లో ఓ పాటలో తళుక్కున మెరిశారు కాబట్టి, రంజాన్‌కు ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్‌ను ‘రేస్‌ 3’తో పాటుగా రిలీజ్‌ చేస్తారట.

ఫైనల్‌గా 3 నిమిషాల నిడివి గల  అఫీషియల్‌ ట్రైలర్‌ను దీపావళికి రాబోతున్న ఆమిర్‌ ఖాన్‌ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’తో జతపరచాలని భావిస్తున్నారట ‘జీరో‘ బృందం. ‘జీరో’ ఒక సెలబ్రేషన్‌లా ఉండాలని భావించారట షారుక్‌. అందుకని ఇలా ప్రతి పండగకు సినిమాకు సంబంధించిన ఏదో ఒక స్పెషల్‌ను రివీల్‌ చేయలనుకుంటున్నారని చిత్రబృందం అంటోంది. ఇంతకీ ఈ ‘జీరో’ షారుక్‌కి ఎందుకంత స్పెషల్‌ అంటే.. ఇందులో ఆయన చేస్తున్న క్యారెక్టర్‌ కూడా స్పెషలే. మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యేవరకూ షారుక్‌ వేరే సినిమా చేయకూడదని ఫిక్స్‌ అయ్యారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement