రణ్‌బీర్‌తో హాలిడే ట్రిప్‌కు రెడీ!
బాలీవుడ్ క్రేజీ లవర్స్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల బంధం ఇప్పుడంత బలంగా లేదని టాక్. దీపికా పదుకొనేతో కలిసి రణ్‌బీర్ ‘తమాషా’ చిత్రంలో నటించడం కత్రినాని ఆగ్రహానికి గురి చేసిందని పరిశీలకులు అంటున్నారు. అందుకని రణ్‌బీర్‌తో కత్రినా ఇంతకు ముందు ఉన్నంత క్లోజ్‌గా ఉండటంలేదట. ఈ ఇద్దరూ దాదాపు విడిపోయినట్లేనని చెప్పుకుంటున్నారు. అలాగే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. తమ మధ్య పెరిగిన ఈ దూరాన్ని మాయం చేయడానికి రణ్‌బీర్ ట్రై చేస్తున్నారట.
కొత్త సంవత్సరం సందర్భంగా కత్రినాతో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారట. కొంచెం మారాం చేసిన తర్వాత కత్రినా ఈ ట్రిప్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎక్కడికి చెక్కేస్తారో సన్నిహితులకు కూడా చెప్పలేదట. కచ్చితంగా ఫారిన్ కంట్రీస్‌కే వెళతారని ఊహించవచ్చు. మరి.. ఈ లవ్ బర్డ్స్ ఎక్కడికి వెళతారో? హాలిడే ట్రిప్‌లో మనసు విప్పి, అన్నీ మాట్లాడుకుని తమ మధ్య పెరిగిన దూరాన్ని ఇక ఎప్పుడూ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తపడతారేమో!