ఆమెతో కలిసి నటించను : కత్రినా | Katrina Kaif Breaks Silence on Working With Deepika Padukone | Sakshi
Sakshi News home page

ఆమెతో కలిసి నటించను : కత్రినా

Published Thu, May 10 2018 8:25 PM | Last Updated on Thu, May 10 2018 8:33 PM

Katrina Kaif Breaks Silence on Working With Deepika Padukone - Sakshi

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌(ఫైల్‌ ఫొటో)

ముంబై : బాలీవుడ్‌ హీరోయిన్లు కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనే అందంతోనే కాకుండా తమ అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. ఇతర నాయికలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గురించి కత్రినాను అడగ్గా.. అలియా భట్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, తమ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ తయారు చేయాల్సిందిగా ఆది(ఆదిత్య చోప్రా)కి చెప్పానన్నారు. అయితే ఆ సినిమాలో తామిద్దరికీ శక్తిమంతమైన పాత్రలు ఉండాలని, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని కోరానని తెలిపారు. అలియా, నేను కలిసి నటిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కత్రినా విశ్వాసం వ్యక్తం చేశారు.  

మరి దీపికాతో కలిసి మీరు నటిస్తారా అన్న ప్రశ్నకు బదులుగా క్యాట్స్‌ ‘నో ’ అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రణ్‌బీర్‌ కపూర్‌తో గతంలో కత్రినా, దీపికాలకు ఉన్న రిలేషన్‌ కారణంగానే కత్రినా ఈవిధంగా స్పందించారని  బీ- టౌన్‌లో టాక్‌ విన్పిస్తోంది. మరి ‘బ్రహ్మాస్త్ర’  సినిమాలో నటించినప్పటి నుంచి అలియా భట్‌ కూడా రణ్‌బీర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం కత్రినా దృష్టికి రాలేదేమోనని సెటైర్లు వేస్తున్నారు. అయితే గతంలో అలియా కూడా కత్రినా, దీపికాలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement