Deepika padukon
-
L&T ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం
-
1000 కోట్లు ఊరికే రాలేదు..! ఇవి కదా ప్లస్ పాయింట్స్
-
కల్కి ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్‌తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్‌తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
'జవాన్' మూవీ రివ్యూ
టైటిల్: జవాన్ నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్, సంజయ్ దత్ నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ దర్శకత్వం: అట్లీ కుమార్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్‌కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్లో సరైన హిట్ లేకపోవడంతో అక్కడ సౌత్ సినిమాల హవా కొనసాగింది. అలాంటి సమయంలో పఠాన్ విడుదల కావడం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసి బాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. అలా పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన షారుక్.. తాజాగా 'జవాన్'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్ అట్లీ ఈ సినిమాతో హిట్ కొట్టి బాలీవుడ్లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదుల అయిన జవాన్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ‘జవాన్’ కథేంటంటే.. కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్ ఖాన్ (విక్రమ్ రాథోడ్) అండ్ టీమ్ హైజాక్ చేస్తారు. ఆ టీమ్‌లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్ (షారుక్ ఖాన్) మెట్రోను ఎందుకు హైజాక్ చేశాడు. .? ఆ హైజాక్ సీన్లోకి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్ రాథోడ్ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్ డీలర్‌గా ఉన్న విజయ్ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్ రాథోడ్‌కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. యాక్షన్ రివేంజ్ సినిమాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్ ఓరియేంటేడ్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్ అట్లీ తమిళ హీరో విజయ్‌తో తెరి, మెర్సిల్, బిగిల్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి బాలీవుడ్లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్‌లో కూడా మంచి మెసేజ్‌ను ఇచ్చాడు. ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్లో విక్రమ్ రాథోడ్‌తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్‌కు ప్లస్ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్ సీన్లు ఇవే. ఫస్టాఫ్‌లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్ ఇష్యూలతో జవాన్ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్ నటన, యాక్షన్స్ సీన్స్ ముందు అవన్నీ ఆడియన్స్ పెద్దగా పంటించుకోరు. మెట్రో హైజాక్ చేసింది విక్రమ్ రాథోడ్ అయితే.. ఈ విషయంలో జైలర్‌గా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్ట్ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్ రాథోడ్, ఆజాద్‌కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్‌లో కూడా మంచి యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ అంతగా పండించవనే చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆజాద్ జైలర్ అయితే విక్రమ్ రాథోడ్ ఒక జవాన్ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్' చేతిలో ఉన్న గన్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్' ప్రాణాలు పోతాయి. సేమ్ 'జవాన్' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలో షారుక్ ఖాన్ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్ ప్రంజెంటేషన్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్ సీన్స్‌తో పాటు సెంటిమెంట్ సీన్స్ పండించడంలో షారుక్ ఎక్కడా తగ్గలేదు. జవాన్‌తో నయనతార బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్‌కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్‌గా సూపర్బ్ అనిపించేలా తనదైన మార్క్ నటనతో మెప్పించింది. కానీ షారుక్ ఖాన్‌తో ఆమె జోడీ అంతగా హైలెట్ కాలేదు. విక్రమ్ రాథోడ్‌కు భార్యగా దీపికా పదుకోన్ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్ అయ్యేలా మెప్పిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కాళీ గైక్వాడ్‌గా విజయ్ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్ అతనికి బాలీవుడ్లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్ పెరగడం ఖాయం. సినిమాలో విలన్ రోల్‌తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్‌లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్ దత్ కామియో రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్ అట్లీ స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ ఉండదు. విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్ హై రేంజ్లో ఉంటాయి. ఇందులో అనిరుధ్ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్‌తో పాటు పలు సీన్స్‌లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్ ఉండదు. ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామెన్ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్ -
జవాన్‌లో ఊహించని ట్విస్ట్.. సౌత్ ఇండియా స్టార్ హీరోను గుర్తించారా?
'పఠాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఇంటర్నెట్లో ఇది తుఫానుగా మారింది. అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్మురేపాడు. నయనతార భారీ యాక్షన్ స్టంట్స్ చూసి అభిమానులు ఫిదా అవడం ఖాయం. జవాన్ ట్రైలర్ చాలా రిచ్‌గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన టాప్ హీరోయిన్!) రెండు నిమిషాల 12 సెకన్ల ప్రివ్యూ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇందులో యాక్షన్ క్వీన్‌గా నయనతార టీజర్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. జవాన్ ప్రీవ్యూలో లేడీ సూపర్‌స్టార్ సైనికురాలిగా గ్లింప్స్ చూపించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్లో ఎంట్రీ కోసం వెయిట్ చేసిన నయనతారకు జవాన్ మంచి క్రేజ్ తీసుకురావడం ఖాయం. జవాన్‌లో సౌత్ ఇండియన్ స్టార్ హీరో జవాన్ ట్రైలర్‌ను చూసిన అభిమానులు అందులో కోలీవుడ్ హీరో దళపతి విజయ్ను గుర్తించారు. ఇందులో అతను అతిధి పాత్రలో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కొంతమంది 'జవాన్' సినిమా ఫ్యాన్స్ తమ డేగ కళ్లతో విజయ్ను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. ముఖం స్పష్టంగా లేనప్పటికీ, అతను విజయ్ కావచ్చునని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Prabhas Project-K: 'ప్రాజెక్ట్ కే' టైటిల్ ఇదేనా..?) ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా, సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో నటిస్తోంది. ప్రియామణి, సన్యా మల్హోత్రా, తమిళ నటుడు యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జవాన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ హోమ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. Is this #Thalapathy @actorvijay?#Leo | #Jawan | #JawanPrevue pic.twitter.com/AVFji2zVOs — ᴊᴜsᴛ sʀᴇᴇʀᴀᴍ (@sreeramhere_) July 10, 2023 View this post on Instagram A post shared by TeaKadai Raja (@teakadai_raja) -
ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి మెప్పించిన ఎన్టీఆర్ తాజాగా 'దేవర'గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ రాకింగ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. (ఇదీ చదవండి: నన్ను చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.. రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి) ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్ తన 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిధ్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీపై మరో క్రేజీ బజ్ నెలకొంది. తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి. చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి అయితే బాగుంటుందని మేకర్స్ అంచనా వేశారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్.. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. (ఇదీ చదవండి: Bhola Sankar Movie: స్కెచ్ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?) -
దీపికా రాజీనామా!
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్ . ‘మామి’ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారామె. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో ‘ముంబయ్ చలన చిత్రోత్సవాలు’ (ఎమ్ఎఫ్ఎఫ్)ను నిర్వహిస్తుంటుంది ‘మామి’. ‘‘నిజానికి ‘మామి’ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహించడం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చాయి. నా కర్తవ్యాన్ని నేను బాగానే నిర్వహించాననే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నా రెండో ఇంటిగా నేను భావించే ముంబయ్‌కి తీసుకురావడం నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. కానీ నా ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షురాలి పదవీ బాధ్యతలపై నేను సరైన ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. నాకన్నా సమర్థులైన వారి చేతిలో అధ్యక్ష పదవి ఉంటే నాకు çహ్యాపీగా ఉంటుంది’’ అన్నారు దీపికా పదుకోన్. -
లీటర్ యాసిడ్‌తో నాపై దాడి చేశాడు
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే నటిస్తున్న తాజా చిత్రం ‘చపాక్’. యాసిడ్ దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో స్పందించారు. యాసిడ్ దాడికి గురైన రంగోలి చందేల్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ చిత్ర నిర్మాతలపై, దర్శకురాలిపై ప్రశంసలజల్లు కురిపించారు. ‘చపాక్ ట్రైలర్‌ను చుశాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించాలని కోరుకుంటున్నాను’ అనే క్యాప్షన్ జత చేసి తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో రంగోలి తనపై జరిగిన యాసిడ్ దాడి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ వ్యక్తి ప్రేమను నిరాకరించినందుకు అతను ఒక లీటర్ యాసిడ్‌తో నాపై దాడి చేశాడని.. దీంతో తన ముఖానికి 54 సర్జరీలు జరిగాయని చెప్పుకొచ్చారు. ‘దాడి తర్వాత నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. యాసిడ్ దాడి వల్ల నా అందాన్ని కోల్పోయావంటూ చాలా మంది నాపై సానుభూతి చూపించారు. మీరు ఊహించగలరా.. ఈ సర్జరీల కోసం నా శరీరంలోని వివిధ భాగాల నుంచి వైద్యులు నా చర్మాన్ని ప్యాచ్‌లుగా తీసుకున్నారు. యాసిడ్ ధాటికి నా అవయవాలు అన్నీ కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్లు నా చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు. ఈ ఘటనలో నా రొమ్ము భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. నేను బిడ్డలకు పాలు పట్టేటపుడు తీవ్రమైన నొప్పిని భరించాను. ఇప్పటికీ నా మెడను కొన్ని సమయాలల్లో తిప్పలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. అలాగే ఈ దాడిలో నా కన్నును కోల్పోయాను. దానికి ప్రస్తుతం రెటీనా మార్పిడి చేయాల్సి ఉంది’ అని రంగోలి తన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం భారదేశంలో యాసిడ్ ఘటనలు పెరిగిపోయాయని, యాసిడ్ దాడి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని ఆమె అందోళన వ్యక్తం చేశారు. Meghna and Deepika will earn a lot of tears from this film, what my family and I went through along with the prejudice we faced was worse than death... story of an acid attack survivor need to reach this nation, praying that it works🙏 — Rangoli Chandel (@Rangoli_A) December 10, 2019 ఇక చపాక్ విషయానికి వస్తే.. దీపికా పదుకోనే, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. చపాక్‌లో యాసిడ్ దాడి ఘటన అనంతరం కేసు దర్యాప్తు, కోర్టు విచారణ, వైద్య చికిత్సలు ఇలా ఆ యువతి ఎదుర్కొన్న పరిస్థితులను దర్శకురాలు తెరపై మనకు చూపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదలు చేయనున్నట్లు సమాచారం. -
ఏ చిక్నే: రణ్వీర్ సింగ్ కొత్త లుక్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది అతడి ఎనర్జీ, అల్లరితో పాటు విభిన్న వేషధారణ. సినిమాలలో కొత్త గెటప్‌లు ట్రై చేస్తూ బీ- టౌన్లో తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. రణ్వీర్ తన తాజా లుక్ ఫోటొను తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఏ చిక్నే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫోటొలో రణ్వీర్ మీసం లేకుండా క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో, దర్శకుడు కబీర్ సింగ్ తెరకెక్కీస్తున్న ‘83’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 1983 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా శక్తివంతమైన వెస్టిండీస్‌పై గెలిచి భారత్‌కు మొదటి ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఆ సమయంలో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ టీమిండియాకు సారథ్యం వహించి భారత్‌కు అత్యంత ఘనవిజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కపిల్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్‌దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించగా, రణ్వీర్ భార్య, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొన్ కపిల్ భార్య రోమీ పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram Ae Chikne 😉🤳🏾 A post shared by Ranveer Singh (@ranveersingh) on Oct 28, 2019 at 4:05pm PDT అదేవిధంగా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తహీర్ రాజ్ భాసిన్, అప్పటి టీమిండియా మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్, అమ్మి విర్క్ పాటు ప్రముఖ నటులు సినిమాలో నటిస్తున్నారు. కాగా ‘83’ చిత్రం కోసం రణ్వీర్ చాలా హర్డ్‌వర్క్ చేస్తున్నాడని, అచ్చం కపిల్‌దేవ్‌లా కనిపించడం కోసం రణ్వీర్ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు కబీర్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్యూలో తెలిపాడు. కాగా రణ్వీర్ నటించిన గల్లీబాయ్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. -
ఈ చిన్నారిని గుర్తుపట్టగలరా?!
హృద్యమైన నవ్వుతో.. చేతిలో పచ్చని చెట్టుతో ఫొటోకు ఫోజులిచ్చిన ఈ చిన్నారిని గుర్తు పట్టగలరా..? మీ వల్ల కాదంటారా...! మరేం పర్లేదు... ‘పెంటీ ఇంట్లో ఉన్న మిస్ బొటానిస్ట్ను కలవండి’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ.. ఈ ఫొటోకు క్యాప్షన్ జత చేసి హింట్ కూడా ఇచ్చారు. ఏంటీ ఇంకా అర్థం కాలేదా.. ! ఆ బుజ్జాయి మరెవరో కాదు డయానా పెంటీనే. థర్స్డేత్రోబ్యాక్ హ్యాష్‌ట్యాగ్‌తో డయానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. అందుకే పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోపే ఈ ఫొటోకు 90 వేలకు పైగా లైకులు వచ్చాయి. కాగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన డయానా పెంటీ.. ‘కాక్టెయిల్’ మూవీ ద్వారా 2012లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సైఫ్ అలీఖాన్, దీపికా పదుకునే జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో.. డయానా తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ తర్వాత హ్యాపీ బాగ్ జాయేగీ, లక్నో సెంట్రల్, జాన్ అబ్రహాం సరసన ’పరమాణు’ తదితర చిత్రాల్లో నటించారు. View this post on Instagram Meet Ms. Botanist from the house of Penty! 😬 #ThrowbackThursday A post shared by Diana Penty (@dianapenty) on Jan 31, 2019 at 12:37am PST -
ఆమెతో కలిసి నటించను : కత్రినా
ముంబై : బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, దీపికా పదుకొనే అందంతోనే కాకుండా తమ అభినయంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటారు. ఇతర నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి కత్రినాను అడగ్గా.. అలియా భట్‌తో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, తమ కోసం ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయాల్సిందిగా ఆది(ఆదిత్య చోప్రా)కి చెప్పానన్నారు. అయితే ఆ సినిమాలో తామిద్దరికీ శక్తిమంతమైన పాత్రలు ఉండాలని, భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలని కోరానని తెలిపారు. అలియా, నేను కలిసి నటిస్తే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందంటూ కత్రినా విశ్వాసం వ్యక్తం చేశారు. మరి దీపికాతో కలిసి మీరు నటిస్తారా అన్న ప్రశ్నకు బదులుగా క్యాట్స్ ‘నో ’ అంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే రణ్‌బీర్ కపూర్‌తో గతంలో కత్రినా, దీపికాలకు ఉన్న రిలేషన్ కారణంగానే కత్రినా ఈవిధంగా స్పందించారని బీ- టౌన్లో టాక్ విన్పిస్తోంది. మరి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించినప్పటి నుంచి అలియా భట్ కూడా రణ్‌బీర్‌తో సన్నిహితంగా మెలుగుతున్న విషయం కత్రినా దృష్టికి రాలేదేమోనని సెటైర్లు వేస్తున్నారు. అయితే గతంలో అలియా కూడా కత్రినా, దీపికాలతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. -
అందుకే నచ్చావ్..
సాక్షి,పాట్నా: బీజేపీ అగ్రనాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించే ఎంపీ, నటుడు శత్రుజ్ఞ సిన్హా వివాదాస్పద చిత్రం పద్మావతి విషయంలో మాత్రం పార్టీ వైఖరినే అనుసరించారు. పద్మావతి మూవీని వ్యతిరేకించడంతో రాజ్పుట్ కర్ణిసేన ఆయనను ఘనంగా సన్మానించింది. దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌లు నటించిన వివాదాస్పద చారిత్రక చిత్రం పద్మావతిని వ్యతిరేకించిన శత్రుజ్ఞ సిన్హాకు రాజ్పుట్ కర్ణిసేన బీహార్ శాఖ రాణి పద్మిని చిత్రపటం బహుకరించి సముచితంగా సత్కరించింది. ఓవైపు పద్మావతి వివాదంపై బాలీవుడ్ అంతా దర్శకుడు భన్సాలీ వైపు నిలవగా, చిత్రపరిశ్రమకు చెందిన సిన్హా భిన్నమైన వైఖరి తీసుకుని చరిత్రను వక్రీకరించారనే ఆరోపణలపై పద్మావతిని వ్యతిరేకించారు. ఇప్పటికే రాజస్ధాన్, యూపీ, గుజరాత్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.మరోవైపు సినిమాలో మార్పులు చేసినా తాము పద్మావతి విడుదలకు అంగీకరించబోమని రాజ్పుట్ సంఘాలు హెచ్చరించాయి. -
హాలీవుడ్ సీక్వెల్లో దీపిక
కొద్ది రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ విన్ డీసిల్తో కలిసి దీపికా పదుకొనే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రానుందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే దీపిక మాత్రం తనతో సినిమాపై ఇప్పట్లో ఏం చెప్పలేనంటూ దాటవేసింది. గతంలోనే విన్ డీసిల్ లీడ్ రోల్లో నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో దీపిక నటించాల్సి ఉన్నా... డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. విన్ డీసిల్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ xxx సీక్వెల్లో దీపిక నటించనుందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. ఫ్యాన్స్‌తో చాట్ సెషన్ సందర్భంగా దర్శకుడు డిజె కరుసో 'మేం జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం, ఆమె (దీపిక) ఫిబ్రవరిలో షూటింగ్లో జాయిన్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది. -
ఈ వారం you tube హిట్స్
ది యాంగ్రీ బర్డ్స్ మూవీ: ట్రైలర్ నిడివి : 2 ని. 36 సె. హిట్స్ : 92,17,440 యాంగ్రీ బర్డ్స్ మూవీ ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ నుంచి బిగ్ స్క్రీన్‌కి వచ్చేస్తోంది. విడుదల వచ్చే ఏడాది మే. ఈ త్రీడీ కంప్యూటర్ యానిమేటెడ్ యాక్షన్ కామెడీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పిల్లలతో సమానంగా పెద్దలూ ఎదురుచూస్తున్నారని ఈ ట్రైలర్‌కు క్షణక్షణానికీ పెరుగుతున్న హిట్స్‌ను చూస్తే అర్థమౌతుంది. యాంగ్రీ బర్డ్స్ వీడియో గేమ్ ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది. తొలిసారి 2009 డిసెంబరులో అందుబాటులోకి వచ్చిన ఈ పజిల్ వీడియో గేమ్‌ను ఫిన్లాండ్ కంపెనీ రూపొందించింది. దీని సీక్వెల్ వీడియో ‘యాంగ్రీ బర్డ్స్ 2’ ఈ ఏడాది జూలైలో విడుదలైంది. పిజ్జా ర్యాట్ నిడివి : 14 సె. హిట్స్ : 67,20,610 మన్‌హట్టన్ (న్యూయార్క్ సిటీ)లోని ఫస్ట్ ఎవెన్యూ సబ్వే స్టేషన్ మెట్ల మీది నుంచి ఒక మూషికం పిజ్జా ముక్కను తినడం కోసం పడిన తంటాలను ఈవారం లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. రాత్రికి రాత్రి ఈ చిట్టెలుక సోషల్ మీడియాలో ‘పిజ్జా ర్యాట్’గా ఫేమస్ అయింది. కొందరైతే దీనిని ‘ఇండస్ట్రియస్’ సబ్వే ర్యాట్ అని కూడా కీర్తిస్తున్నారు. ఇండస్ట్రియస్ అంటే కష్టపడి పని చేసే తత్వం కలిగి ఉండడం. ఈ ఎలుక ఒళ్లొంచి మరీ సబ్ వే ని క్లీన్ చేస్తోందని వాళ్లు అర్థంచేసుకుని ఉండాలి. మొత్తానికైతే అక్కడ ఒక డిబేట్ కూడా మొదలైంది... సబ్ వేలను ఎందుకని క్లీన్‌గా ఉంచలేకపోతున్నాం అని! అప్‌టౌన్ ఫంక్ : మాష్అప్ నిడివి : 4 ని. 49 సె. హిట్స్ : 80,97,436 ఇంగ్లండ్ స్వరకర్త మార్క్ రాన్సన్, అమెరికన్ గాయకుడు బ్రూనో మార్స్ కలిసి మాష్ అప్ చేసిన (దట్టించిన) వంద సినిమాల్లోని డాన్స్ సన్నివేశాలు ‘అప్‌టౌన్ ఫంక్’ పేరిట యూట్యూబ్ వీక్షకులను వెంటాడుతున్నాయి. గ్రీస్, డర్టీ డాన్సింగ్, సిస్టర్ యాక్ట్, స్లమ్‌డాగ్ మిలియనీర్, 13 గోయింగ్ ఆన్ 30, (500) డేస్ ఆఫ్ సమ్మర్ వంటి చిత్రాల్లోని పాపులర్ సాంగ్స్ పాత తరం వారినీ, కొత్త తరం వారినీ వెనక్కీ ముందుకీ తీసుకెళుతూ వాళ్ల చేత కూడా డాన్స్ చేయిస్తున్నాయి. నిర్మాత కూడా అయిన ఆర్క్ రాన్సన్... బ్రూనో మార్స్తోనే కలిసి ఇంతకు ముందే ‘అప్‌టౌన్ స్పెషల్’ అనే అల్బమ్ తెచ్చారు. తమాషా : ట్రైలర్ నిడివి : 2 ని. 55 సె. హిట్స్ : 53,33,136 ఇంతియాజ్ అలీ డెరైక్షలో వస్తున్న ‘తమాషా’ మూవీ ట్రైలర్ ఇది. ఇందులో రణబీర్ కపూర్, దీపికా పడుకోన్‌ల మధ్య కెమిస్ట్రీ ఏ లెవల్లో కుదిరిందో చూసి ఆనందించాలంటే ఈ వీడియోను తప్పని సరిగా చూడాలి. నవంబర్ 27 విడుదలౌతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు. ఫన్నీ మొమెంట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా ఇందులో మితిమీరని హెచ్చుతగ్గుల్లో కనిపిస్తాయి. ఇక రణబీర్ ఫ్రెంచ్ గడ్డాన్ని మన అబ్బాయిలు అనుకరించడమే మిగిలింది. ఇందులో దీపిక తన కళ్ల మెరుపుతో స్క్రీన్‌ని వెలిగిస్తున్నారు. కావాలంటే చూడండి. కిడ్ కాన్ట్ బ్లో అవుట్ క్యాండిల్ నిడివి : 1 ని. 33 సె. హిట్స్ : 12,15,962 ఈ చిన్నారి పేరు మార్టీ. అమెరికన్. వయసు రెండేళ్లు. రెండ్రోజుల క్రితమే సెకండ్ బర్త్‌డే జరిగింది. బర్త్‌డే అన్నాక కొవ్వొత్తులు ఆర్పడం ఉంటుంది కదా. వన్ ఇయర్ పూర్తయింది కాబట్టి ఒక క్యాండిల్ వెలిగించి... ‘ఊదరా చిట్టి తండ్రీ’ అన్నారు అమ్మానాన్న. అబ్బే.. వీడి వల్ల కాలేదు. బుగ్గలైతే ఉబ్బిస్తున్నాడు కానీ నోట్లోంచి ఉఫ్ మని గాలి మాత్రం రావడం లేదు. చాలాసార్లు ట్రయ్ చేశాడు. చాలా యాంగిల్స్‌లో ట్రై చేశాడు. క్యాండిల్ మాత్రం ఆరిపోలేదు. ఒకసారి ముక్కు కాలబోయింది కూడా. చివరికి ఎలాగైతేనేం ఆర్పేశాడు... విత్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ డాడ్. మై ఔర్ చార్లెస్ : ట్రైలర్ నిడివి : 2 ని. 12 సె. హిట్స్ : 8,56,949 ప్రవాళ్ రమణ్ డెరైక్ట్ చేసిన ‘మై ఔర్ చార్లెస్’ చిత్రం ట్రైలర్ ఇది. సినిమా అక్టోబర్ 30 న విడుదల అవుతోంది. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జీవిత కథ ఆధారంగా తయారైన ఈ చిత్రంలో రణ్‌దీప్ హూడా, రిచా ఛద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్లో శోభరాజ్‌ని ‘మానిప్యులేటర్’గా, ‘హిప్నోటిక్’గా వర్ణించారు. రిచా గురించైతే చెప్పక్కర్లేదు. పొరపాటున కనురెప్పలు వేసినా ఏదో మిస్ అయినట్లే. ‘మై జబ్ ఉసే దేఖ్తి హూ, ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ సెక్స్ విత్ హిమ్’ అనేది ట్రైలర్లో రిచా హాట్ లైన్. రణ్దీప్కి, రీచాకి మధ్య కొన్ని ముద్దు సీన్లు కూడా ఉన్నాయి.