ఈ వారం you tube హిట్స్
ది యాంగ్రీ బర్డ్స్ మూవీ: ట్రైలర్
నిడివి : 2 ని. 36 సె.
హిట్స్ : 92,17,440
యాంగ్రీ బర్డ్స్ మూవీ ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ నుంచి బిగ్ స్క్రీన్‌కి వచ్చేస్తోంది. విడుదల వచ్చే ఏడాది మే. ఈ త్రీడీ కంప్యూటర్ యానిమేటెడ్ యాక్షన్ కామెడీ కోసం ప్రపంచ వ్యాప్తంగా పిల్లలతో సమానంగా పెద్దలూ ఎదురుచూస్తున్నారని ఈ ట్రైలర్‌కు క్షణక్షణానికీ పెరుగుతున్న హిట్స్‌ను చూస్తే అర్థమౌతుంది. యాంగ్రీ బర్డ్స్ వీడియో గేమ్ ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది. తొలిసారి 2009 డిసెంబరులో అందుబాటులోకి వచ్చిన ఈ పజిల్ వీడియో గేమ్‌ను ఫిన్‌లాండ్ కంపెనీ రూపొందించింది. దీని సీక్వెల్ వీడియో ‘యాంగ్రీ బర్డ్స్ 2’ ఈ ఏడాది జూలైలో విడుదలైంది.
పిజ్జా ర్యాట్
నిడివి : 14 సె.
హిట్స్ : 67,20,610
మన్‌హట్టన్ (న్యూయార్క్ సిటీ)లోని ఫస్ట్ ఎవెన్యూ సబ్‌వే స్టేషన్ మెట్ల మీది నుంచి ఒక మూషికం పిజ్జా ముక్కను తినడం కోసం పడిన తంటాలను ఈవారం లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. రాత్రికి రాత్రి ఈ చిట్టెలుక సోషల్ మీడియాలో ‘పిజ్జా ర్యాట్’గా ఫేమస్ అయింది. కొందరైతే దీనిని ‘ఇండస్ట్రియస్’ సబ్‌వే ర్యాట్ అని కూడా కీర్తిస్తున్నారు. ఇండస్ట్రియస్ అంటే కష్టపడి పని చేసే తత్వం కలిగి ఉండడం. ఈ ఎలుక ఒళ్లొంచి మరీ సబ్ వే ని క్లీన్ చేస్తోందని వాళ్లు అర్థంచేసుకుని ఉండాలి. మొత్తానికైతే అక్కడ ఒక డిబేట్ కూడా మొదలైంది... సబ్ వేలను ఎందుకని క్లీన్‌గా ఉంచలేకపోతున్నాం అని!
అప్‌టౌన్ ఫంక్ : మాష్‌అప్
నిడివి : 4 ని. 49 సె.
హిట్స్ : 80,97,436
ఇంగ్లండ్ స్వరకర్త మార్క్ రాన్సన్, అమెరికన్ గాయకుడు బ్రూనో మార్స్ కలిసి మాష్ అప్ చేసిన (దట్టించిన) వంద సినిమాల్లోని డాన్స్ సన్నివేశాలు ‘అప్‌టౌన్ ఫంక్’ పేరిట యూట్యూబ్ వీక్షకులను వెంటాడుతున్నాయి. గ్రీస్, డర్టీ డాన్సింగ్, సిస్టర్ యాక్ట్, స్లమ్‌డాగ్ మిలియనీర్, 13 గోయింగ్ ఆన్ 30, (500) డేస్ ఆఫ్ సమ్మర్ వంటి చిత్రాల్లోని పాపులర్ సాంగ్స్ పాత తరం వారినీ, కొత్త తరం వారినీ వెనక్కీ ముందుకీ తీసుకెళుతూ వాళ్ల చేత కూడా డాన్స్ చేయిస్తున్నాయి. నిర్మాత కూడా అయిన ఆర్క్ రాన్సన్... బ్రూనో మార్స్‌తోనే కలిసి ఇంతకు ముందే ‘అప్‌టౌన్ స్పెషల్’ అనే అల్బమ్ తెచ్చారు.
తమాషా : ట్రైలర్
నిడివి : 2 ని. 55 సె.
హిట్స్ : 53,33,136
ఇంతియాజ్ అలీ డెరైక్షలో వస్తున్న ‘తమాషా’ మూవీ ట్రైలర్ ఇది. ఇందులో రణబీర్ కపూర్, దీపికా పడుకోన్‌ల మధ్య కెమిస్ట్రీ ఏ లెవల్లో కుదిరిందో చూసి ఆనందించాలంటే ఈ వీడియోను తప్పని సరిగా చూడాలి. నవంబర్ 27 విడుదలౌతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు. ఫన్నీ మొమెంట్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా ఇందులో మితిమీరని హెచ్చుతగ్గుల్లో కనిపిస్తాయి. ఇక రణబీర్ ఫ్రెంచ్ గడ్డాన్ని మన అబ్బాయిలు అనుకరించడమే మిగిలింది. ఇందులో దీపిక తన కళ్ల మెరుపుతో స్క్రీన్‌ని వెలిగిస్తున్నారు. కావాలంటే చూడండి.
కిడ్ కాన్ట్ బ్లో అవుట్ క్యాండిల్
నిడివి : 1 ని. 33 సె.
హిట్స్ : 12,15,962
ఈ చిన్నారి పేరు మార్టీ. అమెరికన్. వయసు రెండేళ్లు. రెండ్రోజుల క్రితమే సెకండ్ బర్త్‌డే జరిగింది. బర్త్‌డే అన్నాక కొవ్వొత్తులు ఆర్పడం ఉంటుంది కదా. వన్ ఇయర్ పూర్తయింది కాబట్టి ఒక క్యాండిల్ వెలిగించి... ‘ఊదరా చిట్టి తండ్రీ’ అన్నారు అమ్మానాన్న. అబ్బే.. వీడి వల్ల కాలేదు. బుగ్గలైతే ఉబ్బిస్తున్నాడు కానీ నోట్లోంచి ఉఫ్ మని గాలి మాత్రం రావడం లేదు. చాలాసార్లు ట్రయ్ చేశాడు. చాలా యాంగిల్స్‌లో ట్రై చేశాడు. క్యాండిల్ మాత్రం ఆరిపోలేదు. ఒకసారి ముక్కు కాలబోయింది కూడా. చివరికి ఎలాగైతేనేం ఆర్పేశాడు... విత్ ది హెల్ప్ ఆఫ్ హిజ్ డాడ్.
మై ఔర్ చార్లెస్ : ట్రైలర్
నిడివి : 2 ని. 12 సె.
హిట్స్ : 8,56,949
ప్రవాళ్ రమణ్ డెరైక్ట్ చేసిన ‘మై ఔర్ చార్లెస్’ చిత్రం ట్రైలర్ ఇది. సినిమా అక్టోబర్ 30 న విడుదల అవుతోంది. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ జీవిత కథ ఆధారంగా తయారైన ఈ చిత్రంలో రణ్‌దీప్ హూడా, రిచా ఛద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌లో శోభరాజ్‌ని ‘మానిప్యులేటర్’గా, ‘హిప్నోటిక్’గా వర్ణించారు. రిచా గురించైతే చెప్పక్కర్లేదు. పొరపాటున కనురెప్పలు వేసినా ఏదో మిస్ అయినట్లే. ‘మై జబ్ ఉసే దేఖ్‌తి హూ, ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ సెక్స్ విత్ హిమ్’ అనేది ట్రైలర్‌లో రిచా హాట్ లైన్. రణ్‌దీప్‌కి, రీచాకి మధ్య కొన్ని ముద్దు సీన్లు కూడా ఉన్నాయి.