ఫోన్‌ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య | Ninth Class Girl Deceased For Phone Over Online Classes In Palakurthi | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య

Published Mon, Jan 18 2021 2:54 AM | Last Updated on Mon, Jan 18 2021 2:54 AM

Ninth Class Girl Deceased For Phone Over Online Classes In Palakurthi - Sakshi

సింధూజ (ఫైల్‌) 

పాలకుర్తి: ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్‌ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పై గండ్రాతి సతీష్‌ కథనం ప్రకారం.. శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్‌ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement