girl dead
-
ఖర్కీవ్‌పై రష్యా క్షిపణి దాడి
మాస్కో: ఉక్రెయిన్ నగరం ఖర్కీవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి ఆటస్థలంలో పడటంతో 14 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. సరిహద్దులకు సమీపంలోని ఖర్కీవ్పైనే జరిపిన మరో దాడిలో 12 అంతస్తుల నివాస భవనం ధ్వంసమయింది. ఘటనలో ఐదుగురు చనిపోగా మరో 59 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలో భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. భవనం వెలుపలి గోడ తీవ్రంగా దెబ్బతింది. సమీపంలో పార్కు చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇలా ఉండగా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆర్మీ జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు రష్యా ప్రకటించింది. కాగా, డొనెట్స్క్ రిజియన్‌లోని చాసివ్ యార్ పట్టణంపై రష్యా జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. పట్టణంలోని పౌరులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ ప్రాంత గవర్నర్ కోరారు. ఉక్రెయిన్ బలగాల మౌలిక వనరుల రవాణాకు కీలకంగా ఉన్న పొక్రొవ్స్క్ నగరానికి అతి సమీపంలో రష్యా బలగాలు తిష్టవేశాయి.ఎయిర్ ఫోర్స్ చీఫ్ తొలగింపు: ముందుకు చొచ్చుకు వస్తున్న రష్యా బలగాలను నిలువరించి, ఎదురు దాడులు చేయడంలో అమెరికా మిత్ర దేశాలు అందించిన ఎఫ్–16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్ కీలకంగా భావిస్తోంది. అయితే, సోమవారం ఒక ఎఫ్–16 యుద్ధ విమానాన్ని రష్యా ఆర్మీ కూల్చి వేసింది. అందులోని పైలట్ కూడా చనిపోయారు. ఘటనను అధ్యక్షుడు జెలెన్స్కీ సీరియస్‌గా తీసుకున్నారు. వైమానిక దళం చీఫ్ మికోలా ఒలెశ్చుక్ను బాధ్యతల నుంచి తొలగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. సైనికుల భద్రతకు ఆయనదే పూర్తి బాధ్యతని మాత్రమే వ్యాఖ్యానించారు. -
కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య...
సంగారెడ్డి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన సిద్దిపేటరూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఏర్వ నర్సవ్వ కూతురు ఏర్వ శివాణి (21)కి నెలరోజుల క్రితం అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అయిన వారం రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందని చెప్పగా కుటుంబీకులు ఆస్పత్రిలో చూపించారు. అయినా కడుపునొప్పి తగ్గలేదు. దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి సమయంలో ఆకస్మాత్తుగా వారి వద్ద కింద పడిపోయింది. ఏం జరిగిందని కుటుంబీకులు అడగడంతో కడుపునొప్పి భరించలేక బీపీ గోలీలు, నిద్రమాత్రలు వేసుకున్నానని చెప్పింది. దీంతో వెంటనే శివాణిని సిద్దిపేటలో పనిచేసే ప్రైమ్ కేర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో అదేరోజు సిద్దిపేటలోని సురక్ష ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శివాణి పరిస్థితి 19వ తేదీన మరింత విషమంగా మారడంతో వైద్యం నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో గురువారం ఉదయం 01:50గంటలకు చేర్పించారు. దీంతో శివాణిని పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యలోనే శివాణి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని, అమ్మమ్మ నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి
భద్రాద్రి కొత్తగూడెం: వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు రావడం సాధారణమైపోయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకు చెందిన కరకగూడెం మండలం అనంతారానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె నిహారిక(13) శుక్రవారం రాత్రి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది. అదే సమయంలో వాంతులు కూడా కావడంతో వెంటనే మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటికే ఆస్పత్రికి చేరుకోగా నిహారికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈనెల 17న బుధవారం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా.. రెండో రోజునే మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా ఆమె చెల్లి కూడా ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో మృతి చెందింది. చదవండి: ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం -
Bird Flu: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
పారిస్: హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కంబోడియాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అన్ని దేశాలు బర్డ్‌ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఈ బాలిక ఫిబ్రవరి 16న తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహించగా బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 22న ప్రాణాలు కోల్పోయింది. అనంతరం బాలిక తండ్రి సహా ఆమెతో సన్నిహితంగా మెలిగిన 12 మంది నమూనాలను అధికారులు సేకరించారు. తండ్రికి కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. అయితే అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతావారి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వీరి పరిస్థితిపై కంబోడియా అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కోళ్లు, ఇతర పక్షుల్లో మాత్రమే కన్పించే బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు అత్యంత అరుదుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో మనుషులకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే అది సోకే అవకాశముంది. అయితే బాలికకు, ఆమె తండ్రికి బర్డ్‌ఫ్లూ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కోళ్లు, పక్షులతో సన్నిహితంగా మెలిగారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాలిక నుంచే ఆమె తండ్రకి వైరస్ సోకిందా? అనే విషయంపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని అధికారులు పేర్కొన్నారు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్నాయని, కొందరు మానవులకు కూడా ఈ వైరస్ వాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని హెచ్చరించింది. చదవండి: టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య -
లవ్ యూ అంటూ వెంటపడ్డాడు.. నో చెప్పడంతో ఆమె నిద్రిస్తుండగా..
ఐ లవ్ యూ.. నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె నువ్వుంటే నాకు ఇష్టం లేదని చెప్పినా.. వెనకాలే తిరుగుతూ వేధింపులకు గురిచేశాడు. చివరిసారిగా అడుగుతున్నా.. ప్రేమిస్తావా లేదా అని బెదిరించి.. ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీలోని నుంచి గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో 90 శాతం శరీరం కాలిపోయి బాధితురాలు ప్రాణాల కోసం పోరాడి చివరకు చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధుమ్కా ప్రాంతానికి చెందిన బాధితురాలు(19).. 12వ తరగతి చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ షారుఖ్ ఖాన్ అనే యువకుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించిదన్న కోపంతో ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు ఆమె.. 90 శాతం కాలిపోయిన గాయాలతో బయటపడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, మెరుగైన వైద్య సేవల కోసం బాధితురాలని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసులు.. నిందితుడు షారుఖ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. కాగా, షారుఖ్ ఖాన్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో తాను ఏ తప్పు చేయలేదన్నట్టుగా చిరునవ్వుతో పోలీసులతో కలిసి వెళ్లాడు. అతడి ముఖంతో ఆనందం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. అతడికి కొంచెం కూడా పశ్చాతాపం లేదని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ అంకితా #JusticeForAnkita హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేస్తూ న్యాయం కావాలని కోరుతున్నారు. See the shameless #Smile of Shahrukh. He has no regrets after burning a Hindu girl to de@th, even after being arrested. #JusticeForAnkita pic.twitter.com/LQ1rJAMOy9 — Akhilesh Kant Jha (@AkhileshKant) August 28, 2022 -
యువతి దారుణ హత్య.. సోషల్‌మీడియా గొడవ వల్ల గన్‌తో..
సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, కామెంట్లు చేయడం సాధారణమే! కానీ ఓ సోషల్ మీడియా పోస్ట్.. అమ్మాయి, అబ్బాయి మధ్య చిచ్చు రేపింది. ఈ గొడవలో తీవ్ర అవమానానికి గురైన ఓ యువకుడు తన క్లాస్మేట్ అయిన అమ్మాయిని అంతమొందించాడు. ఈ ఘటన ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గురువారం చోటు చేసుకుంది. వనిష్క బన్సాల్ అనే అమ్మాయి కాలేజీ హాస్టల్లో ఉంటుంది. ఆమె గురువారం సాయంత్రం హాస్టల్ సమీపంలోని ఓ షాప్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. ఆమె క్లాస్మేట్ అయిన ఆదిత్య తోమర్ అక్కడికి బైక్‌పై వచ్చి.. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకువెళ్లాలని ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనతోపాటు తెచ్చిన గన్ ఆమెను షూట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వనిష్క అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆదిత్య తోమర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొన్ని రోజులు కింద వనిష్క సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై ఆమె క్లాస్మేట్ అయిన ఆదిత్మ కామెంట్ చేశాడు. దీంతో ఆమె తన స్నేహితులకు అతనిపై ఫిర్యాదు చేసింది. వనిష్క స్నేహితులు.. ఆదిత్యను పట్టుకొని ఆమె కాళ్లు మొక్కించి క్షమాపణ చెప్పించారు. దీంతో స్నేహితుల మధ్య జరిగిన అవమానం తట్టుకోలేని ఆదిత్య.. వనిష్కపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని భావించి.. ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. -
ఫోన్ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
పాలకుర్తి: ఆన్లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పై గండ్రాతి సతీష్ కథనం ప్రకారం.. శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క
సాక్షి, రాజేంద్రనగర్: మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు.. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌సాగర్‌లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సోదరి రాజేంద్రనగర్ బుద్వేల్ గ్రీన్ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య ) ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో అతడిని రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కనీసం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో మజ్లిస్ మిన్నకుండిపోయిందని విమర్శించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఓ సంఘటనపై ట్వీట్ చేసిన ఓవైసీ తన ఇంటి పక్కనే మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యం విషయంలో స్పందించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తాము వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తుంటే అరెస్టులు చేస్తూ నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క బాలిక సోదరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నేతలు ఇందిరారెడ్డి, శోభన, వర్రి లలిత్ ఉన్నారు. విచారణ వేగవంతం మొయినాబాద్(చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మొయినాబాద్ ఠాణాకు వచ్చారు. నిందితుడు మధుయాదవ్ గత పరిస్థితులు, కేసుల వివరాలను తెలుసుకున్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన బాత్కు మధుయాదవ్ ముందు నుంచి వివాదాస్పదంగా ఉండేవాడు. రియల్ వ్యాపారం చేస్తూ పలు భూములను వివాదాస్పదంగా మార్చడంతోపాటు సొంత బంధువులకు చెందిన భూమిని కూడా కబ్జాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలోనే స్థానిక పోలీసులు అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ వివరాలన్నీ తెసుకున్న డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఘటన జరిగిన గదిలోని ఆనవాళ్లు, బాలిక సోదరి వెల్లడించిన విషయాలతో మధుయాదవ్ చేసిన దురాఘతాలపై తెలుసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రోజున మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపైనా డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కేసు విచారణాధికారిగా ఇన్స్పెక్టర్ జానయ్యను తప్పించి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌చక్రవర్తికి అప్పగించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఐపై వేటుకు పెరుగుతున్న డిమాండ్ బాలిక మృతి కేసులో మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి మహమూద్‌అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. -
ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నన్ను క్షమించండి అమ్మా.. నాన్న! నేను ప్రేమించిన రంజిత్ పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడు.. నిన్ను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి లేదంటే నువ్వు చచ్చిపోవాలి అని అంటూ బెదిరిస్తూ మానసికంగా నాకు నరకం చూపుతున్నాడు.. అమ్మా.. నేను వాడిని పెళ్లి చేసుకున్నా నన్ను హ్యాపీగా ఉండనివ్వడు.. నేను వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేవడం నాకు ఇష్టం లేదు.. నేను బతికి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుంచి మీకు జరిగే మంచి ఏమీ లేదు.. అందుకే మిమ్మల్ని వదిలిపోతున్నా... గుడ్‌బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్.. మిస్‌యూ మై ఫ్యావిులీ.. మిస్ మై మామ్.. డాడ్.. అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి, గడ్డి మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెండు రోజులకు మృతిచెందింది. సారంగాపూర్ ఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) రెండేళ్ల కిందట సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరీ్మడియట్ పూర్తి చేసింది. ఇంటర్లో తన క్లాస్మేట్ అదే గ్రామానికి చెందిన మడ్డి రంజిత్(19)తో పరిచయం ఏర్ప డి, ప్రేమగా మారింది. ఇంటర్ పూర్తయ్యేవరకు వారి ప్రేమ వ్యవహారం సాఫీగా సాగింది. ఆ తర్వాత ఉమ రెండేళ్లుగా ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతోంది. ఈ క్రమంలో కొన్ని కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ఉమ రంజిత్‌ను కోరుతోంది. అతను అంగీకరించకుండా పెళ్లి చేసుకుంటే నేనే చేసుకోవాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లి కొత్తపల్లి లక్ష్మి, తండ్రి సత్తయ్యలకు తెలిపింది. ఇద్దరి కులాలు వేరైనా తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని వారు రంజిత్‌ను ప్రాధేయపడ్డారు. కానీ అతను వినలేదు. దీంతో బాధిత కుటుంబీకులు ఉమకు వివాహం చేయాలని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా రంజిత్ వాటిని చెడగొడుతూ ఉమకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కుటుంబీకులు మృతదేహంతో ఇంటికి వచ్చారు. ఇంట్లో మృతురాలి అక్కలకు ఉమ రాసిన సూసైట్ నోట్ దొరికింది. ఎస్సై రాజన్న మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి పంపించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫి ర్యాదు మేరకు రంజిత్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టీవీ మీదపడి నెలల చిన్నారి మృతి
సాక్షి, పెద్దవూర(నల్గొండ) : టీవీ మీద పడి 18నెలల చిన్నారి మరణించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ ఆలియాస్ దుర్గమ్మకు ఆరేళ్లక్రితంకనగల్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన శంకరయ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తె స్మైలీ(18నెలలు). కొన్నినెలల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పద్మ తన తల్లిగారు ఊరు అయిన బట్టుగూడెం గ్రామానికి వచ్చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం కావడంతో తన ఇద్దరి పిల్లలను తల్లి మండారి ముత్యాలమ్మ వద్ద ఉంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ముత్యాలమ్మ సోమవారం పెద్ద మనుమరాలిని బడికి పంపించింది. చిన్న మనుమరాలు స్మైలి ని తన వద్దనే ఉంచుకుంది. ము త్యాలమ్మ వంట చేస్తున్న క్రమంలో స్మైలీ ఆడుకుంటూ ఇంట్లోని టీవీ వద్దకు వెళ్లి స్టాండ్‌ను లాగింది. ఆ టీవీ చిన్నారి మీదపడడంతో చెవుల నుంచి రక్తస్రావం కావడంతో చికిత్స నిమి త్తం పెద్దవూరకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతి చెందింది. చిన్నారి మరణవార్త విన్న తల్లి పద్మ హుటాహుటిన బట్టుగూడెం గ్రామానికి చేరుకుంది. ఆల్లారుముద్దుగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి మృత్యుఒడికి చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. -
సెల్‌ఫోన్ పేలి బాలిక మృతి
కజకిస్తాన్ : సేల్ఫోన్ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్‌లోని బాస్టోబల్ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్‌బెక్(14) రాత్రి పడుకునే ముందు ఫోన్లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్‌కి చార్జీంగ్ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్ చార్జీంగ్ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్ అధికారులు వెల్లడించారు. -
ఆడుకుంటున్న తాడే ఉరిగా బిగిసి..
• ఏడేళ్ల బాలిక దుర్మరణం.. • బాలాపూర్ పీఎస్ పరిధిలో ఘటన హైదరాబాద్: తాడుతో ఆటలాడిన చిన్నారికి ఆ తాడే ఉరిగా బిగిసింది. తెలిసీ తెలియక మెడకు చుట్టుకున్న తాడు యమపాశమరుుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ సీమ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వాహెద్ఖాన్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య బ్యూటీపార్లర్‌లో పనిచేస్తుంది. శనివారం ఉదయం రోజూలాగే భార్యాభర్తలిద్దరూ తమ పనులపై బయటకు వెళ్లారు. నలుగురు పిల్లలూ ఎప్పటిలానే ఇంటివద్దే ఉన్నారు. ఏడాది వయసున్న చిన్న కుమార్తె సోఫియా సుల్తానా అల్లరిని కట్టడి చేయడానికి తల్లిదండ్రులు ఆమె నడుమును తాడుతో కట్టేశారు. తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే... వారి పెద్ద కుమార్తె ఫరీన్ సుల్తానా (7) సినిమాల్లో మాదిరిగా... చెల్లి నడుముకు కట్టే తాడు ముడిని తన మెడలో వేసుకుని... కాళ్ల కింద బకెట్ పెట్టుకుని ఆడసాగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా బకెట్ జారి.... తాడు బిగుసుకోవడంతో ఫరీన్ మృతిచెందింది. చలనం లేకుండా పడివున్న ఫరీన్ను చూసిన మిగిలిన పిల్లలు... తను నిద్రపోతోందని భావించి ఇంట్లో పడుకోబెట్టారు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన భార్యాభర్తలు... ఫరీన్ను చూసి గాభరాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
మలికిపురం : పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మరణించిన సంఘటన ఇది. ఈ సంఘటనలో గాయపడిన మట్టపర్రు గ్రామానికి చెందిన తాడి యోగిత(4) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్సై విజయబాబు మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం భవనంపై కొందరి పిల్లలతో కలిసి ఆటలు ఆడుకుంటుండగా, ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయినట్టు పేర్కొన్నారు. బాలిక తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
పదేళ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య?
►కిరోసిన్‌పోసి నిప్పంటించుకుంది ►మంటలు అంటుకున్నా కేకలు వేయని వైనం ►సంఘట స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శాటిలైట్‌సిటి (రాజమహేంద్రవరం రూరల్) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే మంటలు అంటుకున్నప్పటికీ ఆమె కేకలు వేయకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శాటిలైట్‌సిటీ సీబ్లాకుకు చెందిన కళాకారులు విప్ప శ్రీనివాస్, విప్ప లోవలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విప్ప హారిక (10). హారిక స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం తండ్రి శ్రీనివాస్ వేషం వేయడానికి రాజమహేంద్రవరంలో సంబరాలకు వెళ్లిపోయాడు, మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో తల్లి లోవలక్ష్మితో కలిసి హారిక అక్కమ్మతల్లి జాతరమహోత్సవాల్లో అన్నసమారాధనకు వెళ్లింది. అయితే అక్కడ హారిక భోజనం చేయకుండా అన్నంపళ్లెం ఇంటికి తీసుకువచ్చేసింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ పావుగంట తరువాత ఇంటిలో నుంచి పొగలు వచ్చాయి. దాంతో పక్కపోర్షన్లో ఉంటున్న వారు కేకలు వేయగా దగ్గరలో ఉన్న ఒక ఆమె వచ్చి తలుపు తోసి చూసింది. కాలి పట్టాలు మెరుస్తూ కనిపించడంతో లోవలక్ష్మి ఆత్మహత్య చేసుకుందేమోనని భయపడ్డారు. కబురు పంపించగా లోవలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. హారిక మరణించినట్టు గుర్తించారు. సమాచారం తెలిసిన బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కనకారావు, ఎస్సైలు నాగేశ్వరరావు, కిషోర్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హారిక కాలిపోయేటప్పుడు కేకలు కూడా వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కపోర్షన్లోనే ఉంటున్నవారికి కూడా పొగలు వచ్చే వరకు తెలియకపోవడం, పదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు పరిశీలించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. కేసును అనుమానాస్పదమృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ కనకారావు తెలిపారు. ఏకష్టం వచ్చింది తల్లీ ... ఏకష్టం వచ్చింది తల్లీ మమ్ములను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ హారిక తల్లిదండ్రులు లోవలక్ష్మి, శ్రీనివాస్, సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయే ముందు అరగంట వరకు అందరితో ఆప్యాయంగా మాట్లాడి ఇలా వెళ్లిపోయావేంటమ్మా అంటూ అమ్మమ్మ, ముత్తమ్మమ్మ, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. హారిక మృతితో సీ బ్లాక్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాలిక అనుమానాస్పద మృతి
మహేశ్వరం, న్యూస్ లైన్: ఓ బాలిక అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. మృతదేహంపై గాట్లు ఉన్నాయి, దుస్తులు చిరిగిపోయాయి. తెలిసిన వారే ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని మృతురాలి బంధువులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ సంఘటన మండల పరిధిలోని అమీర్‌పేట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ గంగాధర్, స్థానికుల కథనం ప్రకారం.. అమీర్‌పేట గ్రామానికి చెందిన ఏర్పుల కుమార్‌కు భార్యలు శోభ, అరుణ ఉన్నారు. శోభకు కుమారుడు శ్రీకాంత్, కుమార్తె అశ్విని(17) ఉన్నారు. బాలిక గ్రామంలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి అశ్విని కుటుంబీకులతో భోజనం చేసిన అనంతరం 11 గంటల వరకు టీవీలో సినిమా చూసి పడుకుంది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బాలిక ఇంటి ఎదుట ఉన్న పొదల్లో మృతదేహంగా పడి ఉంది. అశ్విని తల్లి శోభ, కుటుంబీకులు గమనించి లబోదిబోమన్నారు. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ రామసూర్యన్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మెడ, నడుము భాగాల్లో గాట్లు ఉన్నాయి. దుస్తులు కొద్దిగా చినిగిపోయి ఉన్నాయి. అశ్వినితో గతంలో చనువుగా ఉండే పొరుగింటికి చెందిన డప్పు కృష్ణ అలియాస్ చిన్నపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. అతడే అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉండొచ్చని బాలిక బంధువులు అతడిపై దాడికి యత్నించారు. దీంతో పాటు అశ్విని సవతి తల్లి అరుణపై కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక హత్యలో ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా బాలిక తండ్రి కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అదుపులో అనుమానితులు.. డప్పు కృష్ణ అలియాస్ చిన్న, అరుణల ప్రవర్తన, కదలికలు అనుమానంగా ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓక్రమంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం మృతురాలి బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న కృష్ణ, అరుణలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. పోస్టుమార్టం నివేదికలో అన్ని వివరాలు వెల్లడవుతాయి. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో ఛేదిస్తాం. సీఐ, గంగాధర్