వనిష్క బన్సాల్, ఆదిత్య తోమర్ (ఫైల్ ఫొటో)
సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, కామెంట్లు చేయడం సాధారణమే! కానీ ఓ సోషల్ మీడియా పోస్ట్.. అమ్మాయి, అబ్బాయి మధ్య చిచ్చు రేపింది. ఈ గొడవలో తీవ్ర అవమానానికి గురైన ఓ యువకుడు తన క్లాస్‌మేట్ అయిన అమ్మాయిని అంతమొందించాడు. ఈ ఘటన ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గురువారం చోటు చేసుకుంది.
వనిష్క బన్సాల్ అనే అమ్మాయి కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఆమె గురువారం సాయంత్రం హాస్టల్ సమీపంలోని ఓ షాప్‌కు తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. ఆమె క్లాస్‌మేట్ అయిన ఆదిత్య తోమర్ అక్కడికి బైక్‌పై వచ్చి.. ఆమెను తన బైక్‌పై ఎక్కించుకువెళ్లాలని ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తనతోపాటు తెచ్చిన గన్ ఆమెను షూట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వనిష్క అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆదిత్య తోమర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గత కొన్ని రోజులు కింద వనిష్క సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై ఆమె క్లాస్‌మేట్ అయిన ఆదిత్మ కామెంట్ చేశాడు.
దీంతో ఆమె తన స్నేహితులకు అతనిపై ఫిర్యాదు చేసింది. వనిష్క స్నేహితులు.. ఆదిత్యను పట్టుకొని ఆమె కాళ్లు మొక్కించి క్షమాపణ చెప్పించారు. దీంతో స్నేహితుల మధ్య జరిగిన అవమానం తట్టుకోలేని ఆదిత్య.. వనిష్కపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని భావించి.. ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment