Lover Who Set Girl On Fire In Jharkhand - Sakshi
Sakshi News home page

లవ్‌ యూ అంటూ వేధించాడు.. నో చెప్పడంతో ఆమె నిద్రిస్తుండగా.. వీడియో వైరల్‌

Published Mon, Aug 29 2022 3:00 PM | Last Updated on Mon, Aug 29 2022 4:09 PM

Lover Who Set Girl On Fire In Jharkhand - Sakshi

ఐ లవ్‌ యూ.. నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె నువ్వుంటే నాకు ఇష్టం లేదని చెప్పినా.. వెనకాలే తిరుగుతూ వేధింపులకు గురిచేశాడు. చివరిసారిగా అడుగుతున్నా.. ప్రేమిస్తావా లేదా అని బెదిరించి.. ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీలోని నుంచి గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో 90 శాతం శరీరం కాలిపోయి బాధితురాలు ప్రాణాల కోసం పోరాడి చివరకు చనిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ‍ప్రకారం.. ధుమ్కా ప్రాంతానికి చెందిన బాధితురాలు(19).. 12వ తరగతి చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ షారుఖ్‌ ఖాన్‌ అనే యువకుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించిదన్న కోపంతో ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు ఆమె.. 90 శాతం కాలిపోయిన గాయాలతో బయటపడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, మెరుగైన వైద్య సేవల కోసం బాధితురాలని రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతిచెందింది. 

ఈ ఘటనలో పోలీసులు.. నిందితుడు షారుఖ్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, షారుఖ్‌ ఖాన్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో తాను ఏ తప్పు చేయలేదన్నట్టుగా చిరునవ్వుతో పోలీసులతో కలిసి వెళ్లాడు. అతడి ముఖంతో ఆనందం కనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. అతడికి కొంచెం కూడా పశ్చాతాపం లేదని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జస్టిస్‌ ఫర్‌ అంకితా #JusticeForAnkita హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేస్తూ న్యాయం కావాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement