13-year-old girl dies of heart attack in Telangana - Sakshi
Sakshi News home page

షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి

Published Sun, May 21 2023 9:28 AM | Last Updated on Sun, May 21 2023 12:25 PM

13 Year Old Girl Died Of Heart Attack - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం: వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు రావడం సాధారణమైపోయింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదమూడేళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకు చెందిన కరకగూడెం మండలం అనంతారానికి చెందిన నారందాస్‌ వెంకటేశ్వర్లు, లావణ్య దంపతుల పెద్ద కుమార్తె నిహారిక(13) శుక్రవారం రాత్రి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పింది.

అదే సమయంలో వాంతులు కూడా కావడంతో వెంటనే మణుగూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటికే ఆస్పత్రికి చేరుకోగా నిహారికను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కాగా, ఈనెల 17న బుధవారం కుటుంబీకులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోగా.. రెండో రోజునే మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇదిలా ఉండగా ఆమె చెల్లి కూడా ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో మృతి చెందింది.

చదవండి: ఆటో, బొలెరో ఢీ.. ముగ్గురి దుర్మరణం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement