భవనంపై నుంచి పడి చిన్నారి మృతి
Published Tue, Aug 2 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
మలికిపురం :
పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మరణించిన సంఘటన ఇది. ఈ సంఘటనలో గాయపడిన మట్టపర్రు గ్రామానికి చెందిన తాడి యోగిత(4) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్సై విజయబాబు మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం భవనంపై కొందరి పిల్లలతో కలిసి ఆటలు ఆడుకుంటుండగా, ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయినట్టు పేర్కొన్నారు. బాలిక తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Advertisement
Advertisement