ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన
ముమ్మిడివరం, మలికిపురం, తిరుపతిల్లో నిరసన ప్రదర్శన
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్‌మెన్, సూపర్‌వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.
ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు.
ఉద్యోగ భద్రత కల్పించండి
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment