![February 2025 specialty full details here](/styles/webp/s3/article_images/2025/01/5/Februry-2025.jpg.webp?itok=4H66ZHnd)
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్‌వీ శర్మ చెప్పారు.
– తెనాలి
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Goat-Cart-Kesanapalli.jpg)
మేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ!
ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు.
– మలికిపురం
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Dog-Monkey.jpg)
శునక వానర స్నేహం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది.
– మలికిపురం
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/Vizag-Navy-Show.jpg)
'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలు
సముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్‌లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్‌కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు.
చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment