week days
-
ప్రత్యేక ఫిబ్రవరి.. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా!
ఈ ఏడాది ఫిబ్రవరికో ప్రత్యేకత ఉంది. 2025 ఫిబ్రవరి (February) నెలలో వారంలో ఏడు రోజులూ ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని తెనాలి (Teanali) డిగ్రీ కాలేజి అధ్యాపకుడు ఎస్వీ శర్మ చెప్పారు. – తెనాలిమేక బండి.. ట్రెండ్ సెట్ చేసిందండీ! ఇప్పటి వరకూ మనం ఎండ్ల బండి, గుర్రం బండి చూశాం. కానీ, కోనసీమ జిల్లా మలికిపురం (Malikipuram) మండలం కేశనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆవుల పాల ఉత్పత్తి, ఎండ్ల అందాల పోటీల్లో శనివారం మేక బండి అందరినీ ఆకర్షించింది. అంబాజీపేటకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ ట్రెండ్ సెట్ చేద్దామని ఎంతో శ్రమించి, రూ.7 వేలు వెచ్చించి ఈ బండిని రూపొందించారు. – మలికిపురంశునక వానర స్నేహం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెంలో శునక వానర స్నేహం ఐదేళ్లుగా జాతి వైరాన్ని మరచి వర్ధిల్లుతోంది. ఐదేళ్ల క్రితం ఒక కొండముచ్చుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ శునకాలతో అలవాటు పడిన ఓ కొండముచ్చు తన గుంపును వదిలేసింది. గ్రామంలోని శునకాల గుంపుతోనే ఉంటోంది. – మలికిపురం'చుక్కలు' కాదు.. సమర సన్నాహాలుసముద్రం ఒడ్డున అంత జనం నిలబడి ఆకాశంలోని తారలను ఆసక్తిగా తిలకిస్తున్నట్టుగా ఉంది కదా ఈ చిత్రం. నిజానికి అవి నక్షత్రాలు కావు. యుద్ధ విమానాలు. విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్‌లో శనివారం నావికాదళం అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది. వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగర వాసులు భారీగా బీచ్‌కు తరలివచ్చారు. దీంతో సముద్రతీరం జనసంద్రాన్ని తలపించింది. సాగర తీరంలో నేవీ విన్యాసాలను చూసి వైజాగ్ వాసులు అచ్చెరువొందారు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టి, వాటిని అమలు పరిచే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక భేటీలు నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా పారీ్టకి తన లక్ష్యాలను వివరించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచారాస్త్రాల ఖరారుకు మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశాలున్నాయి. రానున్న వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు.. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదిస్తుందా?
బ్యాంకు ఉద్యోగుల ఐదురోజుల పనిదినాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పనిదినాల్ని తగ్గించి బ్యాంకు ఉద్యోగుల రోజూవారి పనిగంటలు పెంచమని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయనున్నాయా? ఇదే అంశంపై తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ స్పందించారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాల్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అయితే దీనిని కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అని అంశంపై స్పందించలేదు. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి రెండవ శనివారం, నాలుగవ శనివారం రోజు మాత్రమే సెలవు దినాలు. ఒకవేళ కేంద్రం ఐబీఏ ప్రతిపాదనల్ని అంగీకరిస్తే ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కాగా.. రోజూవారి పనిగంటలు పెరిగే అవకాశం ఉందంటూ బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'ప్రేమలో పడండి' అని విద్యార్థులకు సెలవులు మంజూరు!
చైనా ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవటంతో.. పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ప్రోత్సహించేలా చైనా చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా ప్రస్తుతం 'ప్రేమలో పడండి" అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళాశాలల్లోని విద్యార్థులను 'ప్రేమలో పడండి" అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం. చైనా స్థానికి మీడియా ప్రకారం...ఫ్యాన మీయి ఎడ్యుకేషన్ గ్రూప్ నిర్వహిస్తున్న మిన్యాంగ్ ప్లయింగ్ వొకేషనల్ కాలేజ్ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ..జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను ప్రొత్సహిస్తోంది చైనా. జనన రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిపుణలు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ..ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకువచ్చి అమలు చేశారు. వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది. దీంతో చైనా జనాభాను పెంచేందుకు రకరకాలుగా యత్నిస్తున్నా.. అందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎక్కవ మంది పిల్లల కారణంగా వారి సంరక్షణ, విద్యకు సరిపడే ఆదాయం లేకపోవడంతో విముఖత చూపిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా..ప్రజల నుంచి సానూకూల స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో నిపుణులు జనాభా క్షీణతను నియంత్రించేలా ఇలా వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..) -
వారం రోజుల్లో ఇవ్వండి
పాలమూరు, డిండి డీపీఆర్‌లు సమర్పించాలని రాష్ట్రానికి కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి డెడ్‌లైన్ విధించింది. వారం రోజుల్లో ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్‌లే ప్రధానమని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషికి లేఖ రాశారు. ‘‘పాలమూరు, డిండిలకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరినా స్పందించలేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుల విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఈ రెండు ప్రాజెక్టుల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిశీలిస్తుందని తెలిపింది. అందువల్ల డీపీఆర్‌లు సమర్పించండి. వీటినే కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి సమర్పిస్తాం. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ వీటినే ముందుంచుతాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటే ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి వివరాలను నివేదిక రూపంలో తమకు సమర్పించాలని బోర్డు సూచించింది. ఈ లేఖతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని జత చేసింది. కృష్ణా జలాల విషయంలో తమకున్న కేటాయింపుల్లోంచే నీటిని వాడుకుంటున్నామని, ఎక్కడా పునర్విభజన చట్టాన్ని, ఇతర నిబంధనలను అతిక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్న తరుణంలో మరోమారు ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు రాసిన లేఖలో.. పాలమూరు ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే ఉత్తర్వులివ్వగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న మరో జీవో వెలువరించారని తెలిపింది. అయితే తాజాగా ఏపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, అపెక్స్ భేటీ నిర్వహించి సమస్య పరిష్కరించాలని సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. -
వారంలోగా అక్రమ కట్టడాలు తొలగించాలి
జమ్మికుంట : పట్టణంలోని వంతెనకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు వెంటనే అక్రమ కట్టడాలు తొలగించి సెట్‌బ్యాక్ చేసుకోవాలని నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ శ్రీకాంత్‌తో కలిసి ఆయన రైల్వేఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న దుకాణాలను గురువారం పరిశీలించారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం వంద అడుగులకు ఇరువైపులా సెట్‌బ్యాక్ చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. తాగునీటి పైపులైన్ నిర్మాణం, పట్టణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. నడిరోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని వ్యాపారులు కోరగా.. చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారులు వారంలోగా అక్రమ కట్టాడాలను తొలగించుకోవాలని లేకుంటే తామే కట్టాడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. వారి వెంట ఏఈ రాజేశం, నగర పంచాయతీ సిబ్బంది ఉన్నారు. -
ట్రైనింగ్‌లో గున్న ఏనుగు పాస్
పూర్తి కానున్న శిక్షణ మరో వారం రోజుల్లో సందర్శకుల వీక్షణకు సిద్ధం ఆరిలోవ(విశాఖ) : ఇందిరాగాంధీ జూ పార్కులో శిక్షణ పొందుతున్న గున్న ఏనుగు మరో వారం రోజుల్లో సందర్శకులను అలరించనుంది. ఈ గున్న ఏనుగు ఏడాది మేలో విజయనగరం జిల్లా సాలూరు పరిసరాలలో పంటపొలాల్లో తిరిగి అక్కడ రైతులను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ అధికారులు చిత్తూరు జిల్లాలో కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి రెండు ఏనుగులను సాలూరు తీసుకొచ్చారు. 'ఆపరేషన్ గజ'లో భాగంగా వాటి సహాయంతో అక్కడ హల్చల్ చేస్తున్న గున్న ఏనుగును పట్టుకొని విశాఖ జూ పార్కుకు తరలించారు. అడవుల్లో తిరిగే ఈ గున్న ఏనుగుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇక్కడ సందర్శకులకు అలవాటు పడే విధంగా జూ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. దానికి తర్ఫీదు ఇవ్వడానికి కుప్పం క్యాంప్ నుంచి ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఇద్దరు నిపుణులను ఇక్కడకు తీసుకొచ్చారు. వారు గున్న ఏనుగుకు 25 కమేండ్స్(సైగలతో కూడిన శిక్షణలో విభాగాలు)లో శిక్షణ ఇచ్చారు. కుప్పం క్యాంప్ నుంచి వచ్చిన ఏనుగులు కూడా శిక్షణలో సహకరిస్తున్నాయి. శిక్షణ ముగిశాక వాటిని తిరిగి కుప్పం క్యాంప్ తరలించే అవకాశం ఉంది.