నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు | YS Jagan Visaka Tour Live Updates | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు

Mar 4 2026 9:19 AM | Updated on Mar 4 2026 3:40 PM

YS Jagan Visaka Tour Live Updates

వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన అప్‌డేట్స్‌.. 

👉విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ కలిశారు. విశాఖ రాణాప్రతాప్‌ నగర్‌లోని ఆయన నివాసంలో ఇటీవల వివాహం జరిగిన వాసుపల్లి గణేష్‌ రెండో కుమారుడు వాసుపల్లి సాకేత్‌, శ్రావణిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌.. వారిని ఆశీర్వదించారు.

  • అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరు
  • అరకు వ్యాలీ తుంగల్‌గూడ గ్రామంలోని రాధాక్రిష్ణ ఆలయంలో వివాహా వేడుక
  • వివాహ వేడుకలో నూతన వధూవరులు అశ్వని, చాణక్యలకు  వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌

  వైఎస్ జగన్‌కు స్వాగతం 

  • అరకు చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్న వైఎస్‌ జగన్‌.
  • గిరిజన సాంప్రదాయ దింసా నృత్యంతో వైఎస్ జగన్‌కు స్వాగతం పలకనున్న మహిళలు..

👉విశాఖ బయలుదేరిన వైఎస్‌ జగన్‌. 

👉వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ కుమారుడు గోవింద్‌ సాకేత్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.

👉గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం, విశాఖ నుంచి హెలికాప్టర్‌లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.

👉మధ్యాహ్నం అరకు నుంచి హెలికాప్టర్‌లో తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్‌నగర్‌కు చేరుకుని అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ చిన్న కుమారుడు గోవింద్‌ సాకేత్‌ వివాహ రిసెప్షన్‌ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement