Ninth class student
-
ప్రాణం తీసిన వాటర్ బాటిల్
సాక్షి,పెద్దపల్లి : తోటి విద్యార్థినులతో కలిసి.. సంతోషంగా పాఠశాలకు బయల్దేరింది. వెళ్లొస్తాను.. బై అంటూ అమ్మానాన్నకు చెప్పింది. ఆ పిలుపే వారికి చివరి పిలుపు అయ్యింది. అలా బయల్దేరిందో లేదో.. అంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. విద్యార్థిని వెంట తీసుకెళ్తున్న వాటర్ బాటిల్ ఆటోలో నుంచి కింద పడడంతో దానిని అందుకునే ప్రయత్నంలో కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గ్రామానికి చెందిన తన్నీరు స్వామి, రజిత దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కూతురు అమూల్య, కుమారుడు సంతానం. కుమారుడు మానసికస్థితి సరిగా లేకపోవడంతో అమూల్యను ఉన్నంతలో ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించాడు. అమూల్య గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాల యాజమాన్యం సమకూర్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఎప్పటిలాగే తోటి విద్యార్థినులతో కలిసి పాఠశాలకు బయల్దేరింది. ఆర్ఎఫ్సీఎల్ టౌన్షిప్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే.. అమూల్యకు చెందిన వాటర్ బాటిల్ జారి రోడ్డుపై పడింది. ఆ బాటిల్ తీసుకునేందుకు ఆటో డ్రైవర్‌ను ఆపాలని చెప్పి.. వేగంగా వెళ్తున్న ఆటోలోనుంచి దిగే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో అమూల్య (15) తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. అమ్మానాన్న వెళ్లొస్తానంటూ చెప్పిన కొద్ది క్షణాల్లోనే అమూల్య మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలి : విద్యార్థి సంఘాల ఆందోళన కోల్‌సిటీ: పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆటోలో స్కూల్‌కు వస్తున్న అమూల్య కిందపడి మృతిచెందడంతో పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సదరు పాఠశాల వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, నాయకులు ఎలుకపల్లి సురేష్, గాజుల అవినాష్, ఇరుగురాల సూర్య, ఎన్ఎస్యూఐ నాయకులు దుర్గా, విజయ్, ఉదయ్, సిద్దు పాల్గొన్నారు. -
ఫోన్ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
పాలకుర్తి: ఆన్లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్పై గండ్రాతి సతీష్ కథనం ప్రకారం.. శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లో గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
విద్యార్థినిపై లైంగిక దాడి
తిరువొత్తియూరు: ప్రేమ పేరుతో.. కోవైలో 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భిణిని చేసిన నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోవైకి చెందిన కట్టడ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపునొప్పి అని చెప్పడంతో బాలికకు తల్లిదండ్రులు ఆదివారం కోవై ఆసుపత్రిలో చికిత్సకు అనుమతింప చేశారు. డాక్టర్లు పరిశోధనలో బాలిక గర్భిణిగా ఉన్నట్టు తెలిసింది. దీని గురించి ఆసుపత్రి నిర్వాహకులు కోవై ఈస్ట్ మహిళా పోలీసుస్టేషన్లో సమాచారం తెలియచేశారు. కరోనా భీతిలో ఉన్న విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుటకు తిరస్కరించి, ఎవరికీ తెలియకుండా ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలించి బాలిక ఉంటున్న చోటును తెలుసుకున్నారు. పోలీసులు విద్యార్థిని వద్ద విచారణ చేయగా, తనను ప్రేమిస్తున్నానని చెప్పి చనువుగా మెలిగిన వారే తనకు బెదిరించి లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించింది. దీంతో తాను గర్భిణి అయినట్టు తెలిపింది. తల్లిదండ్రులకు భయపడి ఈ సంగతిని వారికి చెప్పలేదని తరచూ కడుపు నొప్పి రావడంతో తన తల్లితో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేస్తున్న సమయంలో తాను గర్భిణి అయినట్టు తెలిసిందని విద్యార్థిని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కార్తీక్ (23), ధనశేఖర్ (24), సింగనల్లూరుకు చెందిన సంతోష్ (19), అలాగే ప్లస్ వన్, ప్లస్‌టూ చదువుతున్న నలుగురితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి విద్యార్థులు నలుగురు జువైనల్ హోంకు తరలించారు. మిగతా ముగ్గురిని జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. విద్యార్థి ఒకరు ఈ విద్యార్థినిని తన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలుచుకుని లైంగిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. తరువాత కార్తీక్, ధనశేఖర్ విద్యార్థినికి బెదిరింపులు ఇచ్చి వారి ఇళ్లకు పిలుచుకుని వెళ్లి లైంగిక దాడి చేశారని తెలియవచ్చింది. దిగ్భ్రాంతిని కలిగించిన ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
బాలికపై యువకుడి అత్యాచారం
తాండూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ ఫొటోలు చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని తాండూరు శివాజీచౌక్‌లో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. తాండూరు మండలం దస్తగిరిపేట్‌కు చెందిన యువకుడు పవన్ స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం బాలికను ప్రేమపేరుతో నమ్మించి కారులో హైదరాబాద్ తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం తన వద్ద ఉన్న బాలిక ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసే యత్నం చేశాడు. దీంతో బాధితురాలు కుటుంబీకులతో కలసి నవంబర్ 8న తాండూరు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. అయితే కొందరు రాజీకి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారు. దీంతో వారం తర్వాత బాధితురాలు తాండూరు డీఎస్పీని ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు మరో ఇద్దరు బాలికలను కూడా వేధించాడని సమాచారం. బాలికపై అత్యాచారం జరిగినా కేసు నమోదులో జాప్యం చేయడం, నిర్లక్ష్యం వహించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థి
చెన్నై ,వేలూరు: బాలికను గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన సంఘటన తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పడవేడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక. ఈమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. బాలిక పక్కింటికి చెందిన 15 సంవత్సరాల బాలుడు కూడా అదే పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్నాడు. వీరి ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలికకు రెండు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలకకు ఐదు నెలలు గర్భమని నిర్దారించారు. అవాక్కైన తల్లిదండ్రులు కుమార్తె వద్ద విచారించారు. ఆ సమయంలో చిన్నారి పక్క ఇంటికి చెందిన విద్యార్థితో చనువుగా ఉన్నట్లు తెలిపింది. దీంతో బాలిక తల్లి ఆరణి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. అనంతరం బాలికను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు
జిన్నారం(పటాన్చెరు): మార్కులు తక్కువగా వస్తున్నాయని, ఇంటి వద్ద బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఓ విద్యార్థి తల్లికి వివరిస్తున్న క్రమంలోనే సదరు విద్యార్థి ఇంటికి పరుగులు తీసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుమ్మడిదల మండలం అన్నారంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన ప్రసాద్ కుమారుడు జనపాల బాలవసంత్‌రావ్(17) స్థానికంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల అనంతరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే క్రమంలో పాఠశాల యాజమాన్యం మంగళవారం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బాలవసంత్‌రావు తల్లి పాఠశాలకు వెళ్లింది. తరగతిలో అందరికన్నా తక్కువ మార్కులు వస్తున్నాయని ఇంటి దగ్గర బాగా చదివించాలని ఉపాధ్యాయులు ఆమెకు వివరిస్తున్నారు. అందరికంటే తక్కువ మార్కులు రావడంతో పాటు తన గురించి ఉపాధ్యాయులు తల్లికి వివరిస్తున్నారన్న మనస్తాపానికి గురైన బాలవసంత్‌రావు ఇంటికి పరుగులు తీశాడు. బాత్రూంలో రాడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి కుమారుడితో పాటు పరుగులు తీసి ఇంటికి వెళ్లగా అప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా కలిచివేసింది. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. -
‘ఫీజు’ భూతానికి విద్యార్థిని బలి!
సాక్షి, హైదరాబాద్: ఫీజుల భూతానికి మరో చదువుల తల్లి బలైపోయింది.. ఫీజు కట్టలేదంటూ పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయకపోవడంతో ఆవేదన చెందింది. ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’అని సూసైడ్ నోట్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జేఎల్ఎస్ నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. జేఎల్ఎస్ నగర్‌కు చెందిన బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్‌గా పనిచేస్తుం డగా, సునీత బోయిన్‌పల్లిలోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తోంది. వారికి సాయిలత, సాయిదీప్తి (14) ఇద్దరు కుమార్తెలు. సాయిలత బీటెక్ చదువుతుండగా.. సాయిదీప్తి స్థానికంగా ఉన్న జ్యోతి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల బాలకృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీప్తి ఫీజులను చెల్లించలేకపోయాడు. దీంతో కొద్దిరోజు లుగా పాఠశాల నిర్వాహకులు ఫీజు చెల్లించాలం టూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. దీంతో పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోగా.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్క సాయిలత ఇంటి వద్దనే ఉంది. త్వరగా వచ్చావేమిటని అక్క అడగటంతో ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయలేదని బాధతో చెప్పింది. బ్యాంకులో పని ఉండటంతో సాయిలత బయటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీప్తి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులసహాయంతో కిం దికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీప్తి ఆత్మహత్యకు ముందు ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’ అని నోట్‌బుక్‌లో రాసిపెట్టినట్లు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీ లించారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని, అందిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని తెలిపారు. యాజమాన్యం వైఖరి వల్లే దీప్తి ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో ఫీజుచెల్లించలేకపోయామని, దాంతో ఇతర విద్యార్థుల ముందు దీప్తిని చులకనగా చూసేవారని ఆమె తల్లిదండ్రులు బాలకృష్ణ, సునీత ఆరోపించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థులను ఫీజుల కోసం వేధించేవారని అక్క సాయిలత పేర్కొంది. ఘటనపై పాఠశాల నిర్వాహకురాలు లక్ష్మిని ప్రశ్నించగా సాధారణంగానే ఫీజు గురించి అడిగామని చెప్పా రు. కడుపునొప్పిగా ఉందని, ఇంటికి వెళతానని దీప్తి అడగటంతోనే ఇంటికి పంపామన్నారు. -
పాపం తొమ్మిదో తరగతి విదార్ధిని...
-
మరో దారుణం
- కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వంచించిన కానిస్టేబుల్ - ఓ ఉద్యోగిని సహకారం - గోప్యంగా ఉంచిన సిబ్బంది అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్న ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన మరువకముందే.. మరోచోట తొమ్మిదో తరగతి విద్యార్థిని వంచనకు గురైంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలో నడుస్తున్న ఓ కేజీబీవీలో చదువుతున్న సదరు విద్యార్థినిని ఓ పోలీస్ కానిస్టేబుల్ లోబర్చుకుని వాంఛ తీర్చుకున్నాడు. అతనికి ఓ ఉద్యోగిని సహకరించింది. కానిస్టేబుల్‌కు సదరు ఉద్యోగినితో ఉన్న చనువుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆర్థిక, ఇతర అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగిని ద్వారా విద్యార్థినిని లోబర్చుకున్నాడు. ఉద్యోగిని కూడా విద్యార్థినికి మాయమాటలు చెప్పి ట్రాప్‌లో పడేలా చేసింది. ఏది మంచో, ఏది చెడో గ్రహించలేని వయసులో ఉన్న ఆ విద్యార్థినితో కానిస్టేబుల్ పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. రెండు మూడు సార్లు నేరుగా కేజీబీవీకి వెళ్లి విద్యార్థినిని బైకులో ఎక్కించుకెళ్లి తిరిగి వదిలిపెట్టినట్లు తెలిసింది. పోలీస్ కావడంతో కేజీబీవీ సిబ్బంది కూడా గట్టిగా చెప్పలేకపోయారనే ప్రచారముంది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడితే తమకు ఇక్కట్లు తప్పవని భావించిన నిర్వాహకులు సదరు విద్యార్థిని బంధువులను పిలిపించి పంచాయితీ పెట్టారు. తమ అమ్మాయిదే తప్పు అని, మరోసారి ఇలా జరిగితే తామే బాధ్యులమని వారితో రాయించుకున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ కోన శిశధర్ పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది. తమకు సంబంధం లేదన్నట్టు నివేదిక? ఇటీవల జిల్లాలోని ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవం కేసును సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. వివిధ శాఖల అధికారులు విచారణ చేసి నివేదికలు ఇచ్చారు. ఎస్ఎస్ఏ అధికారులు మాత్రం సదరు కేజీబీవీ పర్యవేక్షణను ఏపీఆర్ఐఈ సొసైటీ చూస్తుందని, తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 36 ఏపీ సర్వశిక్ష అభియాన్,18 ఏపీఆర్ఐఈ సొసైటీ, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. బిల్లులు, సిబ్బంది వేతనాలు ఆయా పర్యవేక్షణ సంస్థలు చెల్లించినా.. సిబ్బంది రిక్రూట్మెంట్, బదిలీలు ఇలా పలు బాధ్యతలను ఎస్ఎస్ఏ అధికారులే చూస్తున్నారు.