విద్యార్థినిపై లైంగిక దాడి | Ninth Class Student Abused By Four Students In Tamilnadu | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై లైంగిక దాడి

Published Wed, Apr 15 2020 8:50 AM | Last Updated on Wed, Apr 15 2020 8:50 AM

Ninth Class Student Abused By Four Students In Tamilnadu - Sakshi

తిరువొత్తియూరు: ప్రేమ పేరుతో.. కోవైలో 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భిణిని చేసిన నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోవైకి చెందిన కట్టడ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపునొప్పి అని చెప్పడంతో బాలికకు తల్లిదండ్రులు ఆదివారం కోవై ఆసుపత్రిలో చికిత్సకు అనుమతింప చేశారు. డాక్టర్‌లు పరిశోధనలో బాలిక గర్భిణిగా ఉన్నట్టు తెలిసింది. దీని గురించి ఆసుపత్రి నిర్వాహకులు కోవై ఈస్ట్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో సమాచారం తెలియచేశారు. కరోనా భీతిలో ఉన్న విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుటకు తిరస్కరించి, ఎవరికీ తెలియకుండా ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయింది.

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలించి బాలిక ఉంటున్న చోటును తెలుసుకున్నారు. పోలీసులు విద్యార్థిని వద్ద విచారణ చేయగా, తనను ప్రేమిస్తున్నానని చెప్పి చనువుగా మెలిగిన వారే తనకు బెదిరించి లైంగిక దాడి చేశారని ఆమె ఆరోపించింది. దీంతో తాను గర్భిణి అయినట్టు తెలిపింది. తల్లిదండ్రులకు భయపడి ఈ సంగతిని వారికి చెప్పలేదని తరచూ కడుపు నొప్పి రావడంతో తన తల్లితో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేస్తున్న సమయంలో తాను గర్భిణి అయినట్టు తెలిసిందని విద్యార్థిని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కార్తీక్‌ (23), ధనశేఖర్‌ (24), సింగనల్లూరుకు చెందిన సంతోష్‌ (19), అలాగే ప్లస్‌ వన్, ప్లస్‌టూ చదువుతున్న నలుగురితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారిని కోర్టులో హాజరుపరిచి విద్యార్థులు నలుగురు జువైనల్‌ హోంకు తరలించారు. మిగతా ముగ్గురిని జైలుకు తరలించారు.  ఈ వ్యవహారంలో పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. విద్యార్థి ఒకరు ఈ విద్యార్థినిని తన ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలుచుకుని లైంగిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. తరువాత కార్తీక్, ధనశేఖర్‌ విద్యార్థినికి బెదిరింపులు ఇచ్చి వారి ఇళ్లకు పిలుచుకుని వెళ్లి లైంగిక దాడి చేశారని తెలియవచ్చింది. దిగ్భ్రాంతిని కలిగించిన ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement