
చెన్నై ,వేలూరు: బాలికను గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన సంఘటన తిరువణ్ణామలైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పడవేడు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక. ఈమె అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. బాలిక పక్కింటికి చెందిన 15 సంవత్సరాల బాలుడు కూడా అదే పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్నాడు. వీరి ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలికకు రెండు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలకకు ఐదు నెలలు గర్భమని నిర్దారించారు. అవాక్కైన తల్లిదండ్రులు కుమార్తె వద్ద విచారించారు. ఆ సమయంలో చిన్నారి పక్క ఇంటికి చెందిన విద్యార్థితో చనువుగా ఉన్నట్లు తెలిపింది. దీంతో బాలిక తల్లి ఆరణి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచారు. అనంతరం బాలికను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment