సాక్షి, హైదరాబాద్: ఫీజుల భూతానికి మరో చదువుల తల్లి బలైపోయింది.. ఫీజు కట్టలేదంటూ పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయకపోవడంతో ఆవేదన చెందింది. ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’అని సూసైడ్ నోట్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జేఎల్‌ఎస్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. జేఎల్‌ఎస్ నగర్‌కు చెందిన బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్‌గా పనిచేస్తుం డగా, సునీత బోయిన్‌పల్లిలోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తోంది. వారికి సాయిలత, సాయిదీప్తి (14) ఇద్దరు కుమార్తెలు. సాయిలత బీటెక్ చదువుతుండగా.. సాయిదీప్తి స్థానికంగా ఉన్న జ్యోతి హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఇటీవల బాలకృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీప్తి ఫీజులను చెల్లించలేకపోయాడు. దీంతో కొద్దిరోజు లుగా పాఠశాల నిర్వాహకులు ఫీజు చెల్లించాలం టూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. దీంతో పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోగా.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్క సాయిలత ఇంటి వద్దనే ఉంది. త్వరగా వచ్చావేమిటని అక్క అడగటంతో ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయలేదని బాధతో చెప్పింది.
బ్యాంకులో పని ఉండటంతో సాయిలత బయటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీప్తి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులసహాయంతో కిం దికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీప్తి ఆత్మహత్యకు ముందు ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’ అని నోట్‌బుక్‌లో రాసిపెట్టినట్లు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీ లించారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని, అందిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని తెలిపారు.
యాజమాన్యం వైఖరి వల్లే దీప్తి ఆత్మహత్య..
ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో ఫీజుచెల్లించలేకపోయామని, దాంతో ఇతర విద్యార్థుల ముందు దీప్తిని చులకనగా చూసేవారని ఆమె తల్లిదండ్రులు బాలకృష్ణ, సునీత ఆరోపించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థులను ఫీజుల కోసం వేధించేవారని అక్క సాయిలత పేర్కొంది. ఘటనపై పాఠశాల నిర్వాహకురాలు లక్ష్మిని ప్రశ్నించగా సాధారణంగానే ఫీజు గురించి అడిగామని చెప్పా రు. కడుపునొప్పిగా ఉందని, ఇంటికి వెళతానని దీప్తి అడగటంతోనే ఇంటికి పంపామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment