రాంచీ: ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన ధన్‌బాద్‌లోని తెతుల్ మరిలో జరిగింది.
ఈ ఘటనపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందించారు. దర్యాప్తు నిమిత్తం తమ టీం ధన్‌బాద్‌కు వెళ్తుందని ట్వీట్ చేశారు. చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ కూడా ఈ ఘనటపై స్పందించారు. పాఠశాలకు సీబీఎస్‌ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది తీవ్రమైన ఘటన అని అన్నారు. జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చామని చెప్పారు.బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించామని ఆయన చెప్పారు.
బాలిక మృతిపై బాధిత తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు
Comments
Please login to add a commentAdd a comment