NTR31 Movie Update: Priyanka Chopra Jonas Opposite For Jr NTR In Prashanth Neel Next? - Sakshi
Sakshi News home page

Jr NTR: ఎన్టీఆర్‌ కోసం క్రేజీ హీరోయిన్‌ను ప్లాన్‌ చేస్తున్న ప్రశాంత్ నీల్‌

Published Wed, Jun 7 2023 4:46 PM | Last Updated on Wed, Jun 7 2023 6:17 PM

NTR31: Priyanka Chopra Jonas Opposite Jr NTR in Prashanth Neel Next? - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి  మెప్పించిన ఎన్టీఆర్‌ తాజాగా 'దేవర'గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్‌ - కొరటాల శివ రాకింగ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రమిది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

(ఇదీ చదవండి: నన్ను చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు.. రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి)

ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఎన్టీఆర్ తన 31వ సినిమా కోసం ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రం చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిధ్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ మూవీపై మరో క్రేజీ బజ్ నెలకొంది. తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందట. అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో దీపికా పదుకొణె,  మృణాల్ ఠాకూర్  పేర్లు వినిపించాయి.

చివరకు ప్రియాంక కన్ఫార్మ్ అయినట్లుగా తెలుస్తోంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక, తారక్ జోడి అయితే బాగుంటుందని మేకర్స్‌ అంచనా వేశారట. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దు నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
(ఇదీ చదవండి: Bhola Sankar Movie: స్కెచ్‌ అదిరింది, చిరంజీవికి బాలకృష్ణ జై కొడతాడా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement