ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుందని తెలిసింది. ముందు ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆరంభించే కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment