చలో మెక్సికో Jr NTR will star in an action film directed by Prashanth Neel shooting starts in August in Mexico. Sakshi
Sakshi News home page

చలో మెక్సికో

Published Mon, Jun 3 2024 6:16 AM | Last Updated on Mon, Jun 3 2024 11:44 AM

First schedule of NTR Dragon movie starts in Mexico

మెక్సికోలో యాక్షన్‌ చేయనున్నారట ఎన్టీఆర్‌. ఆయన హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ మెక్సిక్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ విదేశాల్లోనే జరుగుతుందని, దాదాపు పదిహేను దేశాల్లో  చిత్రీకరణ జరిపేలా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement