హైదరాబాద్‌లో యుద్ధం | Interesting update on Hrithik and NTR War 2 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో యుద్ధం

Jul 16 2024 12:41 AM | Updated on Jul 16 2024 12:41 AM

Interesting update on Hrithik and NTR War 2

హైదరాబాద్‌లో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు హీరోలు ఎన్టీఆర్, హృతిక్‌ రోషన్‌. వారిద్దరూ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో స్టార్‌ హీరోగా దూసుకెళుతున్న ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న ఈ మూవీపై ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ముంబై, గోవాతో పాటు విదేశాల్లోనూ కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. ముంబై షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌–హృతిక్‌ రోషన్‌ పాల్గొన్నారు. కాగా ‘వార్‌ 2’ తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో భారీ బడ్జెట్‌తో పెద్ద సెట్‌ను నిర్మిస్తున్నారు.

ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌–హృతిక్‌లపై యాక్షన్‌ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇంటర్వెల్‌లో వచ్చే ఈ ఫైట్‌ సినిమాలో ఓ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీ ఇతర పాత్రల్లో నటిస్తున్న ‘వార్‌ 2’ ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదలకానుంది. కాగా 2019లో విడుదలైన హిట్‌ మూవీ ‘వార్‌’ కి సీక్వెల్‌గా ‘వార్‌ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement