
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్ . ‘మామి’ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారామె. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో ‘ముంబయ్ చలన చిత్రోత్సవాలు’ (ఎమ్‌ఎఫ్‌ఎఫ్)ను నిర్వహిస్తుంటుంది ‘మామి’. ‘‘నిజానికి ‘మామి’ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహించడం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చాయి.
నా కర్తవ్యాన్ని నేను బాగానే నిర్వహించాననే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నా రెండో ఇంటిగా నేను భావించే ముంబయ్‌కి తీసుకురావడం నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. కానీ నా ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షురాలి పదవీ బాధ్యతలపై నేను సరైన ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. నాకన్నా సమర్థులైన వారి చేతిలో అధ్యక్ష పదవి ఉంటే నాకు çహ్యాపీగా ఉంటుంది’’ అన్నారు దీపికా పదుకోన్.
Comments
Please login to add a commentAdd a comment