Mami Film festival
-
దీపికా రాజీనామా!
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్ . ‘మామి’ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారామె. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో ‘ముంబయ్ చలన చిత్రోత్సవాలు’ (ఎమ్ఎఫ్ఎఫ్)ను నిర్వహిస్తుంటుంది ‘మామి’. ‘‘నిజానికి ‘మామి’ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహించడం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చాయి. నా కర్తవ్యాన్ని నేను బాగానే నిర్వహించాననే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నా రెండో ఇంటిగా నేను భావించే ముంబయ్‌కి తీసుకురావడం నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. కానీ నా ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షురాలి పదవీ బాధ్యతలపై నేను సరైన ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. నాకన్నా సమర్థులైన వారి చేతిలో అధ్యక్ష పదవి ఉంటే నాకు çహ్యాపీగా ఉంటుంది’’ అన్నారు దీపికా పదుకోన్. -
ప్రియాంక.. నీ రిప్లై కోసమే వెయిటింగ్
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఓ కొత్త ఆట ప్రారంభించారు. దీనిలో భాగంగా సోనమ్ ‘బ్రేక్‌ఫాస్ట్ ఎట్ టిఫనీస్’, ‘గాన్ విత్ ద విండ్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు తనకు నచ్చిన మూడు అంతర్జాతీయ సినిమాలుగా చెప్పారు. అనంతరం వాటి పేర్లను ప్రతిబింబించేలా ఆర్ట్ వర్క్ చేసిన సోనమ్.. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతటితో ఆగక తన సోదరి రియా కపూర్, సోదరుడు అర్జున్ కపూర్, సహనటి ప్రియాంక చోప్రాను టాగ్ చేస్తూ వారిని కూడా తమకు నచ్చిన సినిమా పేర్లు చెప్పి వాటికి సంబంధించిన ఆర్ట్ వర్క్‌ని పోస్టు చేయాలంటూ కోరారు. ఇప్పటికే అర్జున్ కపూర్, రియా కపూర్... సోనమ్ చాలెంజ్‌ని పూర్తి చేయడమే కాక జాన్వీని, అన్షులాను ఈ గేమ్ కోసం టాగ్ చేశారు. Mario Puzo gave us Don Vito Corleone. Francis Ford Coppola gave us cinema we couldn’t refuse. I nominate @arjunkapoor to share his favorite film adapted from literature. #TheGodfather @mumbaifilmfest #WordtoScreen2018 #JioMAMIwithStar2018 A post shared by SonamKAhuja (@sonamkapoor) on Aug 29, 2018 at 11:59pm PDT మిగిలింది ప్రియాంక చోప్రా. ప్రియాంక సమాధానం కోసం ఆమె అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక, బాయ్‌ఫ్రెండ్ నిక్‌తో మెక్సికోలో విహరిస్తున్నారు. ‘మామి’ (ముంబై అకాడమి ఆఫ్ మూవింగ్ ఇమెజ్) అనే ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా సోనమ్ ఈ గేమ్‌ని ప్రారంభించారు. ‘మామి ఫిల్మ్ ఫెస్టివల్’ అయిపోయినప్పటికి వీరంతా ఈ గేమ్‌ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. “There's a difference between really loving someone and loving the idea of her.” My favourite word to screen is Gone Girl! Thanks for tagging me @sonamkapoor. I tag @anshulakapoor to tell me her favourite word to screen! #mami A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Aug 30, 2018 at 10:47pm PDT -
వామ్మో.. అదేం డ్రెస్
-
వామ్మో.. అదేం డ్రెస్
న్యూఢిల్లీ : బాలీవుడ్‌నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన దీపికా పదుకునే డ్రెస్ అందుకు తగ్గట్లుగానే ఉంటోంది. గతంలోనూ దీపిక డ్రెస్ సెన్స్‌పై పలు వివాదాలు వచ్చాయి. తాజాగా.. ముంబైలో జరిగిన జియో మామి ఫిలిమ్ ఫెస్టివల్ సందర్భంగా దీపిక ధరించిన డ్రెస్ చెత్తగా ఉందంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా దీపిక గతంలో గుర్తింపు తెచ్చుకుంది. మామి ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొన్న దీపిక దుస్తులను షలీనా నథాని డిజైన్ చేశారు. ముదరు ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులపై ఆభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని డ్రెస్ అనేకన్నా.. గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ అంటే బాగుంటుదని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ⚡️⚡️⚡️ @deepikapadukone wearing @monishajaising earrings @ysl makeup @anilc68 hair @namratasoni #Mamiclosingceremony A post shared by Shaleena Nathani (@shaleenanathani) on Oct 18, 2017 at 9:12am PDT Government : This Diwali we need to go eco-friendly. Go Green. Deepika Padukone : Say No More pic.twitter.com/0snGjVedk8 — N a t a s h a (@JeeVeSohaneya) October 18, 2017 [Clip] Deepika Padukone at the #JioMAMIwithStar2017 ceremony tonight💚💚 pic.twitter.com/YoXpWyivgX — Deepika Padukone FC (@DeepikaPFC) October 18, 2017 -
బాహుబలి బరిలో దిగుతున్నాడు
బాహుబలి.. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద సగర్వంగా నిలబెట్టిన విజువల్ వండర్. ఇప్పటికే ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు సీక్వల్తో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తొలి సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ లోగో తప్ప మరే పోస్టర్ రిలీజ్ చేయకపోయినా సినిమా మీద హైప్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఆ అంచనాలు మరింతగా పెంచేందుకు తొలి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు బాహుబలి యూనిట్. ముంబైలో జరుగుతున్న మామీ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ రోజు(శనివారం) సాయంత్రం 4 గంటలకకు బాహుబలి 2 తొలి పోస్టర్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా మీద ఉన్న హైప్‌తో ఈ పోస్టర్ టీజర్లు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో సరికొత్త రికార్డ్లను సృష్టించటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఈ రోజు నుంచి అధికారంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. తొలి భాగం సక్సెస్‌లో ప్రమోషన్ ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో రెండో భాగానికి కూడా అదే స్థాయిలో భారీ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.