ప్రియాంక.. నీ రిప్లై కోసమే వెయిటింగ్‌ | Sonam Kapoor Started New Game Waiting For Priyanka Chopra Reply | Sakshi
Sakshi News home page

ప్రియాంక.. నీ రిప్లై కోసమే వెయిటింగ్‌

Published Sat, Sep 1 2018 2:20 PM | Last Updated on Sat, Sep 1 2018 2:45 PM

Sonam Kapoor Started New Game Waiting For Priyanka Chopra Reply - Sakshi

మామి ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలకు హాజరైన సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌ ఓ కొత్త ఆట ప్రారంభించారు. దీనిలో భాగంగా సోనమ్‌ ‘బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్‌ టిఫనీస్‌’, ‘గాన్‌ విత్‌ ద విండ్‌’, ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలు తనకు నచ్చిన మూడు అంతర్జాతీయ సినిమాలుగా చెప్పారు. అనంతరం వాటి పేర్లను ప్రతిబింబించేలా ఆర్ట్‌ వర్క్‌ చేసిన సోనమ్‌.. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతటితో ఆగక తన సోదరి రియా కపూర్‌, సోదరుడు అర్జున్‌ కపూర్‌, సహనటి ప్రియాంక చోప్రాను టాగ్‌ చేస్తూ వారిని కూడా తమకు నచ్చిన సినిమా పేర్లు చెప్పి వాటికి  సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ని పోస్టు చేయాలంటూ కోరారు. ఇప్పటికే అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌... సోనమ్‌ చాలెంజ్‌ని పూర్తి చేయడమే కాక జాన్వీని, అన్షులాను ఈ గేమ్‌ కోసం టాగ్‌ చేశారు.

మిగిలింది ప్రియాంక చోప్రా. ప్రియాంక సమాధానం కోసం ఆమె అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక, బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌తో మెక్సికోలో విహరిస్తున్నారు. ‘మామి’ (ముంబై అకాడమి ఆఫ్‌ మూవింగ్‌ ఇమెజ్‌) అనే ట్రస్ట్‌ అధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా సోనమ్‌ ఈ గేమ్‌ని ప్రారంభించారు. ‘మామి ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ అయిపోయినప్పటికి వీరంతా ఈ గేమ్‌ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement