
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ అనడం కన్నా వారిని రోస్ట్ చేసే షో అనడం బెటరేమో! ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలను పిలిచి వారిని చిత్రవిచిత్ర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతాడు హోస్ట్ కరణ్ జోహార్. తాజాగా ఈ షోకు బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఇంకేముంది, వచ్చీరాగానే తన ప్రశ్నలకు పదును పెట్టాడు కరణ్. అర్జున్‌ను ఉద్దేశిస్తూ సోనమ్‌తో.. నీకున్న ఎంతమంది ఫ్రెండ్స్‌తో ఇతడు బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికామె అది నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని బదులిచ్చింది. అందుకు కరణ్ గట్టిగా నవ్వేస్తూ మరెలాంటి బ్రదర్స్ ఉన్నారని మరింత ఉడికించాడు.
ఈ వ్యవహారంతో మధ్యలో కల్పించుకున్న అర్జున్.. నువ్వెలాంటి సిస్టర్‌వి అసలు.. మాకోసం ఏం చెప్తున్నావో తెలుస్తోందా? సోనమ్‌తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? ఏంటి? అని అడిగాడు. తర్వాత అర్జున్‌ను నీ ప్రేయసి మలైకా నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నావని అడిగాడు హోస్ట్. దానికతడు నాకు మలైకా అనే పేరే ఇష్టం, కాబట్టి అలాగే సేవ్ చేసుకున్నానని చెప్తాడు. ఇక ఈ ప్రోమో హాట్‌స్టార్‌లో రిలీజవగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీరి సంభాషణ పూర్తిగా వినాలంటే గురువారం వరకు ఆగాల్సిందే!
చదవండి: మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్
మహేశ్ బాబు 'పోకిరి' స్పెషల్ షో.. ఫ్యాన్స్‌కు పండగే
Comments
Please login to add a commentAdd a comment