Mumbai Film Festival
-
ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన సహచర నటి దీపిక పదుకుణే స్థానాన్ని దక్కించుకుంది. జియో ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న దీపికా స్థానాన్ని ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. నాలుగు నెలల క్రితమే ఈ పదవి నుంచి దీపికా వైదొలిగింది. ఈ సందర్భంగా ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ సంస్ధ వచ్చే సంవత్సరానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ‘మామి’ బోర్డు సభ్యులు కో చైర్ పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ, ఫిల్మ్ డైరక్టర్ అనుపమ చోప్రా, అజయ్ బిజ్లీ, ఆనంద్ జీ మహీంద్రా, ఫర్హన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కౌస్తుభ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్ దేశ్‌ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ ఏకగ్రీవంగా ప్రియంకా చోప్రాను ‘మామి’ చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని తెలిపింది. మామిలోని సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఫిల్మ్‌ఫెస్టివల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. చైర్ పర్సన్‌గా ఎన్నికైన ప్రియంకా చోప్రాను మామి బోర్డ్ ట్రస్టీ ఇషా అంబానీ స్వాగతించింది. ప్రియాంక తన సారథ్యంలో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 22వ ‘మామి’ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరగనుంది. -
దీపికా రాజీనామా!
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్ . ‘మామి’ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారామె. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో ‘ముంబయ్ చలన చిత్రోత్సవాలు’ (ఎమ్ఎఫ్ఎఫ్)ను నిర్వహిస్తుంటుంది ‘మామి’. ‘‘నిజానికి ‘మామి’ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహించడం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చాయి. నా కర్తవ్యాన్ని నేను బాగానే నిర్వహించాననే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నా రెండో ఇంటిగా నేను భావించే ముంబయ్‌కి తీసుకురావడం నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. కానీ నా ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షురాలి పదవీ బాధ్యతలపై నేను సరైన ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. నాకన్నా సమర్థులైన వారి చేతిలో అధ్యక్ష పదవి ఉంటే నాకు çహ్యాపీగా ఉంటుంది’’ అన్నారు దీపికా పదుకోన్. -
మీడియాపై ప్రీతీ జింటా రుసరుస..
మాజీ బాయ్‌ఫ్రెండ్ నెస్ వాడియాపై పెట్టిన కేసు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రీతీ జింటా రుసరుసలాడింది. ‘ఆ విషయాన్ని పోలీసులనే అడగండి’ అంటూ దూకుడుగా బదులిచ్చింది. నెస్ వాడియా తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడంటూ ప్రీతీజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను కొందరు మీడియా ప్రతినిధులు ఆ కేసు విషయమై ప్రశ్నించడంతో సహనం కోల్పోయింది. అంతా తనను సెలిబ్రిటీగా పిలుస్తున్నా, తానూ మామూలు మనిషినేనని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు గురించి ఏమీ మాట్లాడబోనని చెప్పింది. -
ఆర్ధిక సహాయానికి ముందుకొచ్చిన అమీర్ ఖాన్!
ముంబై: బాలీవుడ్ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ 11 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (ఎంఐఎఫ్ఎఫ్) నిర్వహణ కోసం నిధుల కొరత ఉండటంతో సహాయం అందించడానికి అమీర్ విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ కు నిధుల అవసరం ఉంది. నేను 11 లక్షల డొనేషన్ ఇస్తున్నాను. మీరు కూడా సహాయానికి ముందుకు వస్తే గొప్పగా ఉంటుంది అని అమీర్ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్, ట్విటర్ ల్లో వెల్డడించారు. విరాళాలివ్వడానికి చొరవ చూపిన అమీర్ ఖాన్ ను ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీనివాసన్ నారాయణ్ అభినందించారు. . Hey guys, the Mumbai Film Festival 'MIFF' needs our help. I'm donating 11 lakhs.— Aamir Khan (@aamir_khan) September 4, 2014 -
15వ ముంబై చలనచిత్రోత్సవం ప్రారంభం
ముంబై: 15వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురువారం రాత్రి నగరంలో ప్రారంభమైంది. లీ డానియల్ రూపొందించిన ‘ది బట్లర్’ అనే చారిత్రక సినిమాను తొలిరోజు ప్రదర్శించారు. చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా తొలుత గ్రీక్-ఫ్రెంచ్ దర్శక నిర్మాత కోస్టా గవ్రస్, నటుడు కమల్‌హాసన్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాలు అందజేశారు. వైట్‌హౌస్‌లో బట్లర్‌గా పనిచేసిన యూగెన్ అలెన్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా ఈ సినిమా రూపొందింది. యూగెల్ తన జీవితకాలంలో మొత్తం ఎనిమిది అమెరికా దేశ అధ్యక్షులకు బట్లర్‌గా పనిచేశాడు. ఈ సినిమాలో ఫారెస్ట్ విటకర్, సెలబ్రిటీ చాట్ కార్యక్రమానికి అతిథిగా వ్యవహరించిన ఓప్రా విన్ఫ్రే వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎనిమిది రోజులపాటు ఈ చలనచిత్రోత్సవం జరగనుంది. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చలనచిత్రోత్సవాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్యామ్ బెనెగళ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్సోత్సవాల నిర్వహణకు శాశ్వత వేదిక కావాలని, అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఈ వేడుకలకు తమ ప్రభుత్వం కొంతమేర ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. వినోదపు పన్ను మినహాయింపు వివాదాన్ని పరిష్కరించేందుకుగాను చలనచిత్ర రంగానికి చెందినవారితో కలిసి పనిచేస్తుందన్నారు. తనపై అపార ప్రభావం చూపిన గవ్రస్కు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా గవ్రస్ మాట్లాడుతూ సినీప్రేమికులు తనను ఆదరించడంతో ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానన్నారు. అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు తోడ్పడిన శ్యామ్‌బెనెగళ్, గవ్రాస్, కె.జి.బాలచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చలనచిత్రోత్సవ వేడుకలు తనవంటివారితో కలసి పనిచేసేందుకు చక్కని వేదికలవుతాయన్నారు. ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా 65 దేశాలకు చెందిన మొత్తం 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ అనే సినిమా కూడా ఉంది. ఇది స్వలింగ సంపర్కులపై తీసిన చిత్రం. దీంతోపాటు ‘ ది పాస్ట్’ అనే ఇరాన్ చిత్రం, ఆస్ట్రేలియాకు చెందిన ‘ఇన్సైడ్ ల్యూవిన్ డావిస్’, హాలీవుడ్ నటుడు జోసెఫ్ నటించిన ‘డాన్ జాన్’ తదితర సినిమాలు కూడా ప్రదర్శితమవుతాయి.