Shah Rukh Khan's Jawan Prevue; Did you spot Thalapathy Vijay? - Sakshi
Sakshi News home page

జవాన్‌లో ఊహించని ట్విస్ట్‌.. ఈ సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోను గుర్తించారా?

Published Mon, Jul 10 2023 1:47 PM

Shah Rukh Khan Jawan Prevue Did You Spot Thalapathy Vijay - Sakshi

'పఠాన్‌' సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద రూ. 1000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం  'జవాన్‌'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్‌’ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో ఇది తుఫానుగా మారింది.  అనిరుద్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో దుమ్మురేపాడు. నయనతార భారీ యాక్షన్ స్టంట్స్ చూసి అభిమానులు ఫిదా అవడం ఖాయం. జవాన్ ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: అ‍ల్లర్ల మధ్య హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపిన టాప్‌ హీరోయిన్‌!)

రెండు నిమిషాల 12 సెకన్ల ప్రివ్యూ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇందులో యాక్షన్ క్వీన్‌గా నయనతార టీజర్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. జవాన్ ప్రీవ్యూలో లేడీ సూపర్‌స్టార్ సైనికురాలిగా గ్లింప్స్ చూపించారు. చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం వెయిట్ చేసిన నయనతారకు జవాన్‌ మంచి క్రేజ్‌ తీసుకురావడం ఖాయం.

జవాన్‌లో సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరో
జవాన్‌ ట్రైలర్‌ను చూసిన అభిమానులు అందులో కోలీవుడ్‌ హీరో దళపతి విజయ్‌ను గుర్తించారు. ఇందులో అతను  అతిధి పాత్రలో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. కొంతమంది 'జవాన్‌' సినిమా ఫ్యాన్స్‌ తమ డేగ కళ్లతో విజయ్‌ను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా ధృవీకరించలేదు. ముఖం స్పష్టంగా లేనప్పటికీ, అతను విజయ్ కావచ్చునని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: Prabhas Project-K: 'ప్రాజెక్ట్‌ కే' టైటిల్‌ ఇదేనా..?)

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండగా, సన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. దీపికా పదుకొణె కూడా అతిధి పాత్రలో నటిస్తోంది. ప్రియామణి, సన్యా మల్హోత్రా, తమిళ నటుడు యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జవాన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తమ హోమ్ బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement