బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది అతడి ఎనర్జీ, అల్లరితో పాటు విభిన్న వేషధారణ. సినిమాలలో కొత్త గెటప్‌లు ట్రై చేస్తూ బీ- టౌన్‌లో తనకుంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. రణ్‌వీర్ తన తాజా లుక్ ఫోటొను తన అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఏ చిక్నే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫోటొలో రణ్‌వీర్ మీసం లేకుండా క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో, దర్శకుడు కబీర్ సింగ్ తెరకెక్కీస్తున్న ‘83’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 1983 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా శక్తివంతమైన వెస్టిండీస్‌పై గెలిచి భారత్‌కు మొదటి ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఆ సమయంలో మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ టీమిండియాకు సారథ్యం వహించి భారత్‌కు అత్యంత ఘనవిజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కపిల్ సారథ్యంలో భారత్ ప్రపంచకప్ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించగా, రణ్‌వీర్ భార్య, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొన్ కపిల్ భార్య రోమీ పాత్రలో కనిపించనున్నారు.
అదేవిధంగా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తహీర్ రాజ్ భాసిన్, అప్పటి టీమిండియా మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్, అమ్మి విర్క్ పాటు ప్రముఖ నటులు సినిమాలో నటిస్తున్నారు. కాగా ‘83’ చిత్రం కోసం రణ్‌వీర్ చాలా హర్డ్‌వర్క్ చేస్తున్నాడని, అచ్చం కపిల్‌దేవ్‌లా కనిపించడం కోసం రణ్‌వీర్ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు దర్శకుడు కబీర్ సింగ్ ఇటీవలే ఓ ఇంటర్యూలో తెలిపాడు. కాగా రణ్‌వీర్ నటించిన గల్లీబాయ్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment