‘బ్రేకింగ్’ న్యూస్! | Breaking news: Ranbir Kapoor, Katrina Kaif fight? | Sakshi
Sakshi News home page

‘బ్రేకింగ్’ న్యూస్!

Published Thu, Feb 26 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

‘బ్రేకింగ్’ న్యూస్!

‘బ్రేకింగ్’ న్యూస్!

బాలీవుడ్ హాట్ ప్రేమ జంట రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య కాస్త తేడాలు వచ్చినట్టే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎవరూ బయట పడటం లేదు కానీ... చిన్న చిన్న గొడవలేవో తొంగి చూసినట్టు ఓ వెబ్‌సైట్ కథనం. కారణం... కత్రినా మేకప్‌మ్యాన్ సుభాష్‌సింగ్. నిన్నమొన్నటి వరకూ క్యూట్ గాళ్‌కు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా ఉన్న సుభాష్ సెట్స్‌కు లేటుగా వచ్చాడట.

దీనిపై గరమైన అమ్మడు అతగాడిని చెడామడా తిట్టేసిందట. క్యాట్ తిట్ల మహత్యమేమో గానీ... ఉన్నట్టుండి మనోడు ప్రొడ్యూసరైపోయాడు. జయంత్ గిలీతర్ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నాడట. అందులో ఓ స్పెషల్ అప్పియరెన్స్ కోసం రణబీర్‌ను సంప్రదిస్తున్నాని... అతడు కాదనడన్న నమ్మకం ఉందని చెప్పాడు సుభాష్! ప్రేమ పావురాల మధ్య లిటిల్ గ్యాప్‌నకు ఇదే కారణమంటున్నారు బాలీవుడ్ జనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement