'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్‌గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను.
తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్‌లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక.
Comments
Please login to add a commentAdd a comment