AP CM YS Jagan Biopic Yatra 2 Movie Motion Poster Released, Video Inside - Sakshi
Sakshi News home page

Yatra 2 Movie Motion Poster: 'నేను విన్నాను... నేను ఉన్నాను' .. యాత్ర-2 పోస్టర్‌ రిలీజ్‌

Published Sat, Jul 8 2023 11:52 AM | Last Updated on Sat, Jul 8 2023 12:15 PM

Yatra 2 Motion Poster Released Now - Sakshi

2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం అందుకుంది.  ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్‌ సీక్వెల్‌ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో మహి వి.రాఘవ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కొడుకుని' అనే లైన్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

నేడు (జులై 8) వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను ఉదయం 11:35 గంటలకు దర్శకులు మహి వి.రాఘవ్‌ విడుదల చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటలతో మోషన్‌ పోస్టర్‌ ప్రారంభం అవుతుంది. 'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే...' అంటూ ఆ నాడు ఆయన మాట్లాడిన గొంతును డైరెక్టర్‌ మహి వి.రాఘవ్‌ నేడు మళ్లీ గుర్తుచేశారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' అనే మాటలతో వీడియో ముగుస్తుంది. వీరిద్దరూ చెప్పిన ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతగానో దగ్గరకు చేరాయి. 

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, ఆపై 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో ఉండనుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement