అల్లు అర్జున్- సుకుమార్ కాంబో హిట్ సినిమా ‘పుష్ప 2 ది రూల్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి బన్నీ యూనిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫీలింగ్స్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వీడియో సాంగ్‌ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.
'పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ పలు భాషల్లో 250+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే సాంగ్ వీడియో రూపంలో తాజాగా విడుదలైంది. తెలుగులో నకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment