అల్లు అర్జున్- సుకుమార్ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే, తాజాగా పీలింగ్స్ అనే పాటతో అభిమానులను మరోసారి ఫిదా చేశారు. అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్‌లో కూడా దేవీశ్రీ ప్రసాద్ తనదైన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగానే ప్లాన్ చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే పట్నా,చెన్నై,కేరళ, కర్ణాటకలో పుష్ప ఈవెంట్స్ జరిగాయి. ఫైనల్‌గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ అభిమానులు భారీగానే పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment