ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ తన బ్రాండ్ ఏంటో చూపిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప2 నాలుగు వారాల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ రూ.1799 కోట్లకు (గ్రాస్) పైగా ఈ చిత్రం రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చిన 'గంగమ్మతల్లి జాతర' సాంగ్ వీడియోను మేకర్స్ యూబ్యూబ్‌లో విడుదల చేశారు.
పుష్ప2 చిత్రంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ ప్రారంభంలో అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. జాతర ఎపిసోడ్‌లో వచ్చే సాంగ్‌లో ఆయన హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. దీంతో అందరూ ఆ పాటకు అభిమానులు అయిపోయారు. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా మహాలింగం ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అదరిపోయే రేంజ్‌లో ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో మెప్పించిన ఈ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment