Pushpa 2 X Review: ‘పుష్ప 2’మూవీ ట్విటర్‌ రివ్యూ | Allu Arjun Pushpa 2 The Rule Movie Twitter Review In Telugu, Check These Tweets Inside Before Watching The Film | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie Twitter Review: ‘పుష్ప 2’ టాక్‌ ఎలా ఉందంటే..?

Published Thu, Dec 5 2024 1:55 AM | Last Updated on Thu, Dec 5 2024 6:19 AM

Pushpa 2: The Rule Movie Twitter Review In Telugu

అల్లు అర్జున్‌ ఫ్యాన్‌తో పాటు యావత్‌ సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2  మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం.. బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘పుష్ప- ది రైజ్‌’ కి సీక్వెల్‌ కావడంతో ‘పుష్ప 2: ది రూల్‌’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. 

దానికి తోడు పాట్నా మొదలుకొని చెన్నై, ముంబై, కొచ్చి లాంటి నగరాలతో పాటు దేశమంతా తిరిగి ప్రచారం చేయడంతో ‘పుష్ప 2’పై భారీ బజ్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గురువారం రాత్రి 9.30 గంటల నుంచే స్పెషల్‌ షోస్‌ పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు  సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

పుష్ప 2 కథేంటి? ఎలా ఉంది?  బన్నీ ఖాతాలో మరో భారీ హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలు ఎక్స్‌(ట్విటర్‌ ) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.


ఎక్స్‌లో పుష్ప 2 చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. బన్నీ మాస్‌ యాక్టింగ్‌ అదిరిపోయిందని అంటున్నారు. సుకుమార్‌ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారీ బ్లాక్‌ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్‌ చేస్తున్నారు.  మరికొంత మంది అయితే ఇది యావరేజ్‌ మూవీ అంటున్నారు.

 పుష్ప 2 డీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.ఫస్టాఫ్‌ బాగుంది. సెకండాఫ్‌ స్టార్టింగ్‌ బాగుంది కానీ చివరి గంట డ్రాప్‌ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాను.

 ఫస్టాప్‌ అద్భుతంగా ఉంది. సెకండాఫ్‌ కథకి న్యాయం జరిగింది అంటూ మరో నెటిజన్‌ 3.25 రేటింగ్‌ ఇచ్చారు.

 ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటవిశ్వరూపం, సుకుమార్‌ డైరెక్షన్‌ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement