మరో రెండు రోజుల్లో ‘పుష్ప’రాజ్ థియేటర్స్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడాయి. అల్లు అర్జున్ ఒక్కడే ఈ మూవీ ప్రచారాన్ని తన భుజనా వేసుకున్నాడు. కొచ్చి, చెన్నై, ముంబైతో పాటు దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌తో పుష్ప 2 ప్రమోషన్స్‌కి ముగింపు కార్డు పడినట్లే. పక్కా ప్లాన్‌తో చేసిన ఈ ప్రమోషన్ ఈవెంట్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. రిలీజ్‌కి ముందే సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ మధ్యకాలంలో ఏపాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది.
(చదవండి: ‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’.. తెలంగాణ హైకోర్టులో విచారణ)
ప్రిరిలీజ్ బిజినెస్‌లో కూడా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ అయింది. ఇక ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటిటి రూపంలో 400 కోట్లు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు . దాదాపు 1060 కోట్ల బిజినెస్ తో ట్రేడ్ వర్గాల లో దడ పుట్టిస్తుంది.
(చదవండి: 'పుష్ప 3' టైటిల్ ఫిక్స్.. కానీ సందేహమే!)
టికెట్ ల విషయానికొస్తే నెల రోజుల ముందే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్ఫ్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలో హాట్ కేక్ లా అమ్ముడుపోవడం ఒక రికార్డ్. బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా ‘పుష్ప2’ నిలిచింది. ఇది కేవలం బుక్ మై షోలోనే ఇన్ని టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. ఇక నార్త్ ఇండియాలో పుష్ప కి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ బుకింగ్ ఓపెన్ అయినా గంటలోనే ఫస్ట్‌డే టికెట్స్ మొత్తం అయిపోయయని ఎగ్జిబిటర్స్ లు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో నే కాదు సౌత్ నార్త్ ఓవర్సీస్ లో ఏ సెంటర్ చూసిన పుష్ప 2 రికార్డులే ఇపుడు హాట్ టాపిక్ అయింది.
మైత్రీ మూవీ మేకర్స్ మూడేళ్లు శ్రమించి పుష్ప2 చిత్రాన్ని నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం సుమారు 12 వేల 500పైగా థియేటర్లలో విడుదలకాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే దాదాపు 55000 వేల షోస్ పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా పుష్ప 2 కావడం విశేషం. 80 దేశాల్లో ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
సెన్సార్ టాక్ కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ రావడం తో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా ప్రౌడ్ ఇండియన్ ఫిల్మ్ గా సినీలవర్స్ అభివర్ణిస్తున్నారు . రిలీజ్ కు ముందే ఇన్ని రికార్డు లను నెలకొల్పిన పుష్ప 2 సినిమా రిలీజ్ తరువాత మరేన్ని రికార్డు ను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment