మహానటి కీర్తి సురేశ్ ఈ మధ్యే పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 12న అతడితో ఏడడుగులు వేసింది. తొలుత గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెల్రేషన్స్ జరుపుకున్నారు. పెళ్లయి వారం కూడా కాలేదు, అప్పుడే తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. అంతేకాదు, మెడలో పసుపు తాడుతోనే ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.
బేబి జాన్
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ బేబి జాన్. వరుణ్ ధావన్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తికి హిందీలో ఇదే తొలి సినిమా కావడం విశేషం! ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌కు కీర్తి హాజరైంది.
సంతోషంలో కీర్తి
వివాహ బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకుని ఈవెంట్‌కు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పెళ్లిలో హీరో విజయ్ ఆశీర్వదించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మా డ్రీమ్ ఐకాన్ విజయ్ సర్ మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించాడు అని రాసుకొచ్చింది.
చదవండి: సర్జరీ కోసం వెళ్తున్నా.. కాస్త ఆందోళనగానే ఉంది: శివరాజ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment